అన్వేషించండి

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే

BP Patients Diet : బీపీ అదుపులో ఉండాలంటే ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్ మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫుడ్స్ విషయంలో కొన్ని మార్పులు చేస్తూ.. లైఫ్​స్టైల్​లో కూడా కొన్ని కంట్రోల్ చేయాలని అంటున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తక్కువ సోడియం, DASH ఆహారం తీసుకుంటూ, ప్రాసెస్డ్ తగ్గించాలి.
  • బరువు, ఒత్తిడి నియంత్రించి ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • పొగతాగడం, ఆల్కహాల్ మానేసి బీపీని నిరంతరం పర్యవేక్షించాలి.

BP Patients Diet and Lifestyle Changes : అధిక రక్తపోటు అనేది కేవలం మందులతోనే నియంత్రించాల్సిన సమస్య కాదు. మనం తీసుకునే ఆహారం, శరీర బరువు, శారీరక శ్రమ, ఒత్తిడి, నిద్ర వంటి జీవనశైలి అంశాలు కూడా బీపీపై ప్రభావం చూపుతాయని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్​గా చేస్తోన్న డాక్టర్ దిలీప్ గూడె తెలిపారు. కొందరు మందులు తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ.. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి బీపీని దీర్ఘకాలం నియంత్రణలో ఉంచడంలో కీలకంగా ఉంటాయని సూచించారు. మరి బీపీ ఉన్నవారు డైట్, లైఫ్​స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్

ఆహారంలో ఎక్కువగా సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బీపీ ఉన్నవారు టేబుల్ సాల్ట్‌ను తగ్గించడంతో పాటు ఊరగాయలు, అప్పడాలు, ప్యాక్ చేసిన స్నాక్స్(లేస్, కుర్​కురే), ఇన్‌స్టంట్ ఫుడ్స్, సాస్‌లు, నిల్వ ఉంచిన మాంసాహారం వంటి వాటిని పరిమితం చేయాలని డాక్టర్ దిలీప్ సూచించారు. ప్యాకెట్ ఫుడ్స్ కొనేటప్పుడు వాటిపై ఉన్న సోడియం పరిమాణాన్ని ఫుడ్ లేబుల్‌లో చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. 

Also Read : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

"బీపీ పేషెంట్లు వీలైనంత వరకు తాజా పదార్థాలతో ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవడం మంచిది. రుచికోసం అదనంగా ఉప్పు వేసే ఆహారాలకు బదులు నిమ్మరసం, వెల్లుల్లి, కొత్తిమీర, ఇతర సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి టేస్టీగా ఆహారం తయారు చేసుకోవచ్చు. తక్కువ సోడియం ఉన్న ఆహారం హైబీపీ ఉన్నవారికి మేలు చేస్తుంది. రక్తపోటు అదుపులో ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది."-డాక్టర్ దిలీప్ గూడె, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్

గుండెకు మేలు చేసే ఆహారం

బీపీ నియంత్రణ కోసం DASH (Dietary Approaches to Stop Hypertension) డైట్ ఒక మంచి ఆహార విధానమని చెప్తున్నారు డాక్టర్ దిలీప్ గూడె. ఎందుకంటే వీటిలో కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, పప్పులు, నట్స్, విత్తనాలు, చేపలు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తారు. ఉప్పు, అదనపు చక్కెర, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాన్ని తగ్గిస్తారు.

Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

ఆకుకూరలు, పండ్లు, బీన్స్, సంపూర్ణ ధాన్యాలు వంటి ఫైబర్, పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు కూడా బీపీని అదుపు చేయడంలో సహాయపడవచ్చు. అయితే కిడ్నీ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసూకోకూడదని తెలిపారు. 

బరువు అదుపులోనే..

అధిక బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు కొంత బరువు తగ్గినా బీపీ నియంత్రణలో మెరుగుదల కనిపించవచ్చు. అందుకే సరైన ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. కేవలం బరువును మాత్రమే కాకుండా నడుము చుట్టుకొలతను కూడా దృష్టిలో పెట్టుకుని ఫిట్​గా మారాలి. 

వ్యాయామం

బీపీ ఉన్నవారు శారీరక శ్రమను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. వేగంగా నడవడం, సైక్లింగ్, ఈత, డ్యాన్స్ వంటి మితమైన తీవ్రత కలిగిన వ్యాయామాలు చేయవచ్చు. వారానికి సుమారు 150 నిమిషాల మితమైన ఏరోబిక్ వ్యాయామం చేయడం, వారంలో కనీసం రెండు రోజులు కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు చేస్తే బీపీ కంట్రోల్ కావచ్చు. ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Also Read : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?

స్మోకింగ్​కి చెక్.. ఆల్కహాల్‌ లిమిట్

స్మోకింగ్ రక్తనాళాలను దెబ్బతీసి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే బీపీ ఉన్నవారు పొగతాగడం పూర్తిగా మానేయడం మంచిది. అలాగే అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆల్కహాల్ తీసుకునేవారు దాన్ని పరిమితం చేయాలి. బీపీ నియంత్రణ కోసం ఆల్కహాల్‌ను తగ్గించడం లేదా మానేయడం మంచిదని సూచించారు డాక్టర్ దిలీప్ గూడె.

ఒత్తిడి తగ్గకుంటే కష్టమే..

ఎక్కువ ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం వంటి అంశాలు జీవనశైలిని ప్రభావితం చేస్తాయని.. కాబట్టి ప్రతిరోజూ తగినంత నిద్రపోవడం అవసరమని డాక్టర్స్ సూచిస్తున్నారు. రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ వ్యాయామాలు, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం ఒత్తిడిని అదుపులోకి తెచ్చుకోవడంలో హెల్ప్ చేస్తాయి. 

వీటిన్నంటినీ ఫాలో అవుతూనే వైద్యులు సూచించిన విధంగా బీపీని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం కూడా ముఖ్యం. ఇప్పటికే మందులు వాడుతున్నవారు వాటిని వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా తీసుకోవాలి. బీపీ తగ్గిందని అనిపించినా స్వయంగా మందుల మోతాదును తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడం అస్సలు మంచికాదని వైద్యులు చెప్తున్నారు. 

Also Read : మధుమేహం, బీపీ, గుండె సమస్యలున్నవారికి 5 బెస్ట్ వ్యాయామాలు ఇవే.. నిపుణుల సూచనలతో

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget