అన్వేషించండి

Managing Diabetes : డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే

Diabetes Management : మధుమేహం పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే కేవలం మందులపై మాత్రమే ఆధారపడకుండా రోజూవారి అలవాట్లలో పలు మార్పులు చేయాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మధుమేహ నియంత్రణకు మందులతో పాటు సమతుల్య ఆహారం ముఖ్యం.
  • నాణ్యమైన నిద్ర, ఒత్తిడి తగ్గించడం, నీరు త్రాగడం అవసరం.
  • బరువు నియంత్రణ, క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి.

Tips to Manage Diabetes Naturally : డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. దీనిని నియంత్రించడానికి కేవలం మందులు మాత్రమే సరిపోవని.. ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అంతే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. కొన్ని అలవాట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే అవి వైద్యులు సూచించిన మందులకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి మధుమేహం ఉన్నవారు లైఫ్​స్టైల్​లో చేయాల్సిన మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

"డయాబెటిస్ నియంత్రణలో మందులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే వాటితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. సహజ చిట్కాలను మందులకు ప్రత్యామ్నాయంగా కాకుండా.. వైద్యుల సూచించిన చికిత్సలో భాగంగా మాత్రమే చూడాలి." అని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్​గా చేస్తోన్నడాక్టర్ దిలీప్ గూడె సూచించారు.

Also Read : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

సమతుల్య ఆహారం

డయాబెటిస్ ఉన్నవారు రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న ప్రోటీన్ ఆహారాలు, నట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్, స్వీట్లు, మైదాతో చేసిన పదార్థాలు, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను వీలైనంత వరకు తగ్గించాలని సూచిస్తున్నారు. 

వ్యాయామం 

వారానికి కనీసం 150 నిమిషాల పాటు మోస్తరు స్థాయి శారీరక వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వంటి సాధారణ వ్యాయామం కూడా ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బరువు నియంత్రణ

అధిక బరువు ఉన్నవారు శరీర బరువులో 5 నుంచి 10 శాతం తగ్గినా రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగుపడే అవకాశం ఉంటుంది. అందుకే సమతుల్య ఆహారం, వ్యాయామంతో బరువును నియంత్రణలో ఉంచుకోవడం అవసరం.

Also Read : మధుమేహం, బీపీ, గుండె సమస్యలున్నవారికి 5 బెస్ట్ వ్యాయామాలు ఇవే.. నిపుణుల సూచనలతో

నాణ్యమైన నిద్ర

ప్రతిరోజూ తగినంత సమయం నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర సరిగా లేకపోవడం లేదా ప్రతిరోజూ వేర్వేరు సమయాల్లో నిద్రపోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.

ఒత్తిడి తగ్గించుకోండి

దీర్ఘకాలిక ఒత్తిడి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంది. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు లేదా మీకు నచ్చిన రిలాక్సేషన్ పద్ధతులను పాటించడం ద్వారా ఒత్తిడి దూరం చేసుకోవచ్చని డాక్టర్ దిలీప్ సూచించారు.

తగినంత హైడ్రేషన్

రోజంతా తగినంత నీరు తాగడం వల్ల శరీరం సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. అధిక రక్తంలో చక్కెర వల్ల వచ్చే డీహైడ్రేషన్ ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చని చెప్తున్నారు.

Also Read : ప్రీ-డయాబెటిస్ ఉందా? ఈ ఫుడ్స్ మానేసి.. ఇవి తింటే మధుమేహం రాదట, ఫాలో అయిపోండి

రెగ్యూలర్ టెస్ట్

ఇంట్లో గ్లూకోమీటర్‌తో రక్తంలో చక్కెర స్థాయిలను అవసరమైనప్పుడు టెస్ట్ చేసుకోవాలి. అలాగే వైద్యుల సూచన మేరకు నిర్దిష్ట వ్యవధిలో HbA1c పరీక్ష చేయించుకోవడం ద్వారా గత రెండు నుంచి మూడు నెలల సగటు చక్కెర స్థాయిలను అంచనా వేసుకోవచ్చు.

వీటిని ఫాలో అవ్వడమే కాకుండా.. వైద్యుల సలహా లేకుండా డయాబెటిస్ మందులు తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడం మంచిది కాదు. అలాగే మూలికల మందులు లేదా సప్లిమెంట్లు వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. సరైన సమయంలో మందులు తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, రక్తంలో చక్కెర పరీక్షలు, వైద్యుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కలిసి గుండె, కిడ్నీలు, కళ్లూ, నరాలపై వచ్చే దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయని డాక్టర్ దిలీప్ తెలిపారు.

మధుమేహం గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కస్టడియల్ డెత్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కస్టడియల్ డెత్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
Embed widget