Suzuki Scooters Updation: లక్ష కంటే తక్కువ ధర, అప్‌డేటెట్ ఫీచర్స్ - కొత్త అవతార్‌లో పాపులర్ స్కూటర్లు
Suzuki Scooters Burgman And Avenis: సుజుకి, తన రెండు పాపులర్ స్కూటర్‌లు బర్గ్‌మ్యాన్ & అవెన్సిస్‌ను అప్‌డేట్ చేసింది. ఈ రెండు టూవీలర్ల రేటు లక్ష రూపాయల కంటే తక్కువ.

Suzuki Burgman And Avenis Updated With New Features: సుజుకి, తన రెండు పాపులర్ స్కూటర్‌లను అప్‌డేట్ చేసి భారతీయ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. సుజుకికి చెందిన ఈ రెండు ద్విచక్ర వాహనాలు - బర్గ్‌మ్యాన్ & అవెనిస్ ధర లక్ష రూపాయల రేంజ్‌లో ఉంటాయి. అప్‌డేట్ చేసిన సుజుకి బర్గ్‌మ్యాన్ సిరీస్ ప్రైస్ రూ. 95,800 నుంచి ఉండగా. సుజుకి అవెనిస్ ధర రూ. 93,200 నుంచి ప్రారంభం అవుతుంది.
సుజుకి అవెనిస్‌లో నయా అప్‌డేట్ ఏంటి?
సుజుకి అవెనిస్ ఇంజిన్‌ను OBD-2B నిబంధనలకు అనుగుణంగా ఉండేలా మార్పు చేశారు. ఇంతకుమించి ఈ స్కూటర్‌లో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు. సుజుకి అవెనిస్ ఇంజిన్ 124 CC సామర్థ్యంతో (Suzuki Avenis Engine Capacity) వస్తుంది. ఇది, 8.7 HP పవర్‌ను రిలీజ్ చేస్తుంది & 10 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మార్కెట్‌లో సుజుకి అవెనిస్ రెండు వేరియంట్లలో లభిస్తుంది - 1. స్టాండర్డ్ ఎడిషన్ & 2. స్పెషల్ ఎడిషన్. ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్ డ్యూయల్ కలర్ టోన్ థీమ్‌లో లాంచ్ అయింది. దీనిలో నాలుగు కలర్ ఆప్షన్స్ (Suzuki Avenis Color Options) లభిస్తున్నాయి. సుజుకి అవెన్సిస్ స్పెషల్ ఎడిషన్ మోడల్ బ్లాక్ అండ్ సిల్వర్ షేడ్స్‌లో లభిస్తుంది. అవెనిస్ స్టాండర్డ్ వేరియంట్ ధర (Suzuki Avenis Standard Edition Price) రూ. 93,200 కాగా & స్పెషల్ ఎడిషన్ ధర (Suzuki Avenis Special Edition Price) రూ. 94,000.
సుజుకి బర్గ్‌మ్యాన్‌లో కొత్త అప్‌డేట్ ఏంటి?
సుజుకి, OBD-2B నిబంధనల ప్రకారం బర్గ్‌మ్యాన్ ఇంజిన్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఈ ద్విచక్ర వాహనంలో 124 CC ఇంజిన్ (Suzuki Burgman Engine Capacity) కూడా ఉంది. ఇది 8.7 HP పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది & 10 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ స్కూటర్ స్ట్రీట్ & స్ట్రీట్ EX అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ EX ధర స్ట్రీట్ వేరియంట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్ట్రీట్ EXలో 12 అంగుళాల రియర్ వీల్‌ను బిగించారు. బర్గ్‌మాన్ స్ట్రీట్ EX ధర (Suzuki Burgman Street EX Price) రూ. 1.16 లక్షలు. ఈ స్కూటర్ మూడు కలర్ ఆప్షన్స్‌లో (Suzuki Burgman Color Options) ఉంటుంది, అవి 'మ్యాట్ బ్లూ' (Matte Blue), 'మ్యాట్ బ్లాక్' (Matte Black), 'బ్రాంజ్' (Bronze). 'మ్యాట్ బ్లూ' ఈ స్కూటర్ కొత్త కలర్ వేరియంట్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

