అన్వేషించండి

Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక

Telangana Harish Rao: పోలీసులు తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని హరీష్ రావు హెచ్చరించారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పలు అంశాలపై మాట్లాడారు.

Harish Rao warns police officers: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తెలంగాణ భవన్‌లో  మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.   రేవంత్ రెడ్డి మెప్పు కోసం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పేర్లను తాము ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నామని ఆయన హెచ్చరించారు. ఏపీలో అక్రమాలకు పాల్పడిన అధికారులకు ప్రస్తుతం పట్టిన గతే ఇక్కడి అధికారులకు కూడా పడుతుందని, రిటైర్ అయినా లేదా విదేశాలకు వెళ్లినా వదిలిపెట్టకుండా చట్టం ముందు నిలబెడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ కామెంట్స్ చేశారు.      

పాలన గాలికి వదిలేసి షోకులు చేస్తున్న రేవంత్          

కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ పూర్తిగా రక్షణలో పడిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి రాత్రి వేళల్లో చిట్‌చాట్లు పెట్టి వివరణ ఇచ్చుకోవడం తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్‌లతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఓయూకు ఒంటరిగా వస్తానని చెప్పిన సీఎం, వేలాది మంది పోలీసుల పహారాలో, విద్యార్థి నేతలను అరెస్టు చేయించి వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు.   

బ్రోకర్ల సలహాలతో నడుస్తున్న ప్రభుత్వం                      

రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని ఒక కన్సల్టెన్సీ కంపెనీ తో పోల్చిన హరీష్ రావు, ప్రభుత్వం  ముంబై బ్రోకర్ల సలహాలతో నడుస్తోందని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి రూ. 30 వేల కోట్ల అప్పు తేవాలని చూస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల్లో 20 శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టారని, తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, రేసింగ్ వంటి అంశాలను తెరపైకి తెస్తూ  డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టారు.                    

అసెంబ్లీ 15 రోజుల పాటు నిర్వహించాలి               

 అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని, అప్పుడే ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను తాము ఆధారాలతో సహా బయటపెడతామని సవాల్ విసిరారు. రుణమాఫీ కాలేదని దేవుడిపై ఒట్టేసి చెప్పినా తనపై కేసులు పెడుతున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలని, కానిస్టేబుళ్ల సంక్షేమాన్ని విస్మరించడం సరికాదని హితవు పలికారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, కుట్రలు చేసినా మరింత ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాడుతామని హరీష్ రావు తేల్చి చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. గ్రీన్ చానల్ ద్వారా హైదరాబాద్‌కు తరలింపు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. గ్రీన్ చానల్ ద్వారా హైదరాబాద్‌కు తరలింపు
Breaking News: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత, హైదరాబాద్‌కు తరలింపు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత, హైదరాబాద్‌కు తరలింపు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Embed widget