Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Stranger Things Season 5 OTT Platform : సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వచ్చేస్తోంది. ఈ సిరీస్‌లో ఇదే ఫైనల్ సీజన్ అని ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' తెలిపింది.

Stranger Things Series Season 5 OTT Release Date Locked : ఎక్కువగా ఫేమస్ అయిన సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ అంటే మనకు గుర్తొచ్చేది 'స్ట్రేంజర్ థింగ్స్'. ఇప్పటివరకూ వచ్చిన 4 సీజన్స్ పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అలరిస్తూ... ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఫైనల్ సీజన్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ సీజన్ 5 ఈ నెల 26 నుంచి ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో ఇదే పైనల్ సీజన్. గత సీజన్స్ కంటే కొత్త సీజన్‌లో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నట్లు డైరెక్టర్ రాస్ డఫర్ తెలిపారు. 'స్ట్రేంజర్ థింగ్స్ 5' వాల్యూమ్ 2లో 5, 6, 7 ఎపిసోడ్స్ ఈ నెల 26 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంటాయి. చివరిదైన ఎనిమిదో ఎపిసోడ్ మాత్రం నూతన సంవత్సరంలో జనవరి 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కొన్ని సెలక్ట్ చేసిన థియేటర్లలోనూ ఈ సిరీస్ ప్రదర్శించనున్నట్లు 'నెట్ ఫ్లిక్స్' వెల్లడించింది.
Hitman aa raha hai upside down ko seedha karne ❤️🔥
— Netflix India (@NetflixIndia) December 23, 2025
Watch Stranger Things 5: Volume 2, out 26 December at 6:30 AM IST, only on Netflix.#Collab pic.twitter.com/V9F1B4izDM
Also Read : 'ఇది నా బాడీ... మీది కాదు' - 'మంగపతి' కామెంట్స్‌పై అనసూయ కౌంటర్!
'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 4 2022లో రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. 'స్క్విడ్ గేమ్' తర్వాత చాలా కాలం పాటు 'నెట్ ఫ్లిక్స్' టాప్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. గత సీజన్ల కంటే మరింత సస్పెన్స్, థ్రిల్‌తో ఈ సీజన్ ఉండబోతోందని అర్థమవుతోంది. ఫైనల్ సీజన్ ఎపిసోడ్స్ రన్ టైంను సైతం 'నెట్ ఫ్లిక్స్' అనౌన్స్ చేసింది.
ఎపిసోడ్ 5 - 1 గంట 8 నిమిషాలు, ఎపిసోడ్ 6 - 1 గంట 15 నిమిషాలు, ఎపిసోడ్ 7 - 1 గంట 6 నిమిషాలు, ఎపిసోడ్ 8 - 2 గంటల 8 నిమిషాలుగా ఉండనున్నట్లు తెలిపింది. ఫైనల్ ఎపిసోడ్ మాత్రం జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది.
స్టోరీ ఏంటంటే?
1980ల కాలంలో జరిగే ఓ సైన్స్ ఫిక్షన్ స్టోరీ. హాకిన్స్ పట్టణంలో 'అప్ సైడ్ డౌన్' అనే సమాంతర ప్రపంచం నుంచి వచ్చే రాక్షసులను... ఎలెవన్ అనే సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయితో పాటు ఓ చిన్నారుల బృందం ఎలా ఎదుర్కొంది అనేదే స్టోరీ. సీజన్ 1లో విల్ అనే చిన్నారి అదృశ్యం కాగా... అతన్ని వెతికే క్రమంలో విల్ ఫ్రెండ్స్‌కు ఓ అతీంద్రయ శక్తులున్న అమ్మాయి కనిపిస్తుంది. ఆమె సాయంతో విల్‌ను వెతకుతుండగా వారికి సమాంతర ప్రపంచం కనిపిస్తుంది.
సీజన్ 2లో విల్ తిరిగి రావడం ఓ భారీ రాక్షసుడు సమాంతర ప్రపంచం నుంచి వచ్చి పట్టణాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తాడు. అతన్ని వీరు ఎలా అడ్డుకున్నారనేదే స్టోరీ. సీజన్ 3లో అతీంద్రయ శక్తులున్న ఎలెవన్ పోర్టల్‌ను మూసేయగా... ఆ గేట్‌ను మళ్లీ తెరిచేందుకు కొందరు యత్నిస్తారు. దాన్ని ఎలా అడ్డుకున్నారు? సీజన్ 4లో కొత్త విలన్ పట్టణంలోకి వచ్చి పిల్లలను చంపడం ప్రారంభిస్తాడు. ఎలెవన్ తన శక్తులతో అతన్ని ఎలా అడ్డుకుంది? అనే వాటిని చూపించారు.





















