అన్వేషించండి

Walk After Eating : భోజనం చేసిన తర్వాత ఎంత సేపు వాక్ చేయాలి.. నడిచేప్పుడు చేయకూడని తప్పులు, గుర్తించుకోవాల్సిన విషయాలివే

Post Meal Walk : చాలామంది తిన్న వెంటనే కాసేపు వాక్ చేస్తారు. అయితే ఇలా మీరు కూడా వాక్ చేయాలనుకుంటే ఎంతసేపు నడిస్తే మంచిది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూసేద్దాం.

Benefits of Walking After Meals : కొందరు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసినా చేయకపోయినా.. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తర్వాత కచ్చితంగా వాక్ చేస్తారు. అయితే ఇది మంచిదని కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. పలు అధ్యయనాలు కూడా దీని ఫలితాలు ఆరోగ్యానికి మంచి చేస్తాయని తెలిపాయి. అయితే అసలు తిన్నాక వాకింగ్ చేయాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి తెలుసా? అప్పుడే మీరు మంచి ఫలితాలు పొందగలరు. అసలు భోజనం తర్వాత వాకింగ్ ఎలా చేయాలి? ఎంతసేపు వాక్ చేస్తే మంచిది? గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటో చూసేద్దాం. 

తిన్న తర్వాత వాక్ చేస్తే కలిగే లాభాలు ఇవే

భోజనం చేసిన తర్వాత ఎటూ కదలకుండా కూర్చోవడం లేదా పడుకోవడం అతి పెద్ద మిస్టేక్ అని మీకు తెలుసా? అలా కాకుండా కాసేపు వాక్ చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కేలరీలు బర్న్ అవుతాయి. తిన్న తర్వాత వాకింగ్ చేస్తే.. మీరు తీసుకున్న ఆహారం ఫ్యాట్​గా కాకుండా ఎనర్జీగా మారుతుంది. దీనివల్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడదు. తిన్న తర్వాత కొందరికి గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. లేదా యాసిడ్ రిఫ్లక్స్ వస్తాయి. ఆ సమస్యను దూరం చేసుకోవాలనుకుంటే నడక బెస్ట్ ఆప్షన్. ఇది కడుపు ఉబ్బరాన్ని దూరం చేసి.. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. 

భోజనం తర్వాత నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్యాట్ స్టోరేజ్ కాకుండా అడ్డుకుని ఇన్సులిన్ సెన్సిటివిటీని అదుపులో ఉంచుతాయి. దీనివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. పలు రీసెర్చ్​లు కూడా దీనికి మద్ధతునిచ్చాయి. అలాగే మెటబాలీజం పెరిగి.. శరీరానికి రక్త ప్రసరణ మెరుగ్గా అందుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

వాకింగ్ చేసేప్పుడు చేయకూడని మిస్టేక్స్ ఇవే.. 

తిన్న తర్వాత వాకింగ్ చేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. భోజనం చేసిన వెంటనే పరుగెత్తడం, జాగింగ్ లాంటివి చేయకూడదు. ఇలా చేస్తే మీరు జీర్ణక్రియ మందగిస్తుంది. అంతేకాకుండా నొప్పులు వస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్ పెరుగుతాయి. కాబట్టి మెల్లగా వాక్ చేయండి. తినకముందు స్పీడ్​ వాక్, జాగింగ్, రన్నింగ్ మంచివి కానీ.. తిన్న తర్వాత జస్ట్ వాక్ చేస్తే సరిపోతుంది. 

ఎంతసేపు వాక్ చేయాలి.. 

తిన్న తర్వాత వాక్ చేయాలనుకుంటే ఎక్కువసేపు సమయం అవసరం లేదు. మెల్లిగా ఓ పది నుంచి పదిహేను నిమిషాలు నడిచినా మంచిదే. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరిగి.. మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి తిన్న వెంటనే మంచి ఫలితాలు కావాలనుకుంటే స్పీడ్​ వాక్​, ఎక్కువ సమయం వాక్ చేయడం మానేసి.. రిలాక్స్​గా పావుగంట వాక్ చేసేయండి. 

ఉదయం, సాయంత్రం మీరు ఖాళీ కడుపుతో ఎక్కువ సమయం వాక్ చేయవచ్చు. అలాగే జాగింగ్, పరుగెత్తడం కూడా చేయవచ్చు. ఇది మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువును అదుపులో ఉంచి.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా.. అప్పటికే ఉన్నవాటిని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
AP DSC Notificication: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Allu Arjun: పాన్ వరల్డ్ రేంజ్‌లో బన్నీ, త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - భారతదేశమే ఆశ్చర్యపోతుందన్న నిర్మాత నాగవంశీ
పాన్ వరల్డ్ రేంజ్‌లో బన్నీ, త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - భారతదేశమే ఆశ్చర్యపోతుందన్న నిర్మాత నాగవంశీ
Cricket Betting Apps: ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలి.. రైలు కింద పడి ఆత్మహత్య
ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలి.. రైలు కింద పడి ఆత్మహత్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP DesamAshutosh Sharma 66 Runs DC vs LSG Match Highlights | అశుతోష్ శర్మ మాస్ బ్యాటింగ్ చూశారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
AP DSC Notificication: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Allu Arjun: పాన్ వరల్డ్ రేంజ్‌లో బన్నీ, త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - భారతదేశమే ఆశ్చర్యపోతుందన్న నిర్మాత నాగవంశీ
పాన్ వరల్డ్ రేంజ్‌లో బన్నీ, త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ - భారతదేశమే ఆశ్చర్యపోతుందన్న నిర్మాత నాగవంశీ
Cricket Betting Apps: ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలి.. రైలు కింద పడి ఆత్మహత్య
ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలి.. రైలు కింద పడి ఆత్మహత్య
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Nayanthara: నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార... ఆ కండిషన్స్ దెబ్బకు 30 కోట్లు లాస్!?
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార... ఆ కండిషన్స్ దెబ్బకు 30 కోట్లు లాస్!?
Shihan Hussaini - Pawan Kalyan: ఎంతో బతిమాలిన తర్వాతే కరాటే నేర్పారు... గురువు మృతికి నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్
ఎంతో బతిమాలిన తర్వాతే కరాటే నేర్పారు... గురువు మృతికి నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Embed widget