Chalaki Chanti: జీవితంలో అలాంటి రోజు ఎవ్వడికీ రావొద్దు... సుధీర్, రష్మీలో బెస్ట్ ఎవరంటే? - చలాకీ చంటి ఇంటర్వ్యూ
Chalaki Chanti Interview: 'జీవితంలో అలాంటి రోజు ఎవ్వడికీ రావొద్దు' అంటూ తాజాగా 'చిట్ చాట్ సెలబ్రిటీ టాక్ షో'లో తన జీవితంలోనే అత్యంత దారుణమైన రోజు గురించి చలాకీ చంటి వెల్లడించారు.

Chalaki Chanti Latest Interview: చలాకీ చంటి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశక్తి కాదు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన చంటి 'జబర్దస్త్' షో ద్వారా మరింత పాపులాటిని సంపాదించుకున్నారు. తాజాగా ఈ నటుడు, కమెడియన్ చిట్ చాట్ అనే సెలబ్రిటీ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూని మరో ప్రముఖ బుల్లితెర నటుడు నూకరాజు చేయడం విశేషం.
నూకరాజు : హాయ్ అండి... నేను మీ జబర్దస్త్ నూకరాజు. ఈరోజు చిట్ చాట్ లో భాగంగా మనతో ఒక సెలబ్రిటీ ఉన్నారు. ఆ సెలబ్రిటీ రెండు తెలుగు రాష్ట్రలకే కాదు యావత్ ప్రపంచానికే తెలుసు. ఆయనే చలాకి చంటి.
చంటి : ఇవన్నీ చెప్పమన్నారా నిన్ను?
నూకరాజు : మామూలుగా చెప్పమన్నారు.. నేను ఇంకొంచెం యాడ్ చేసి చెప్పాను.
నూకరాజు : ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అలా మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటి? నేను నీ టీంలోకి వచ్చింది ఓకే... ఇంకేమన్నా?
చంటి : అది గ్రహాలు బాలేక జరిగింది. నీచమైన దినమేది అంటే అది నువ్వు వచ్చిందే (సరదాగా). కలర్ ఫుల్ డే గురించి అంటే నా జీవితంలో నాలుగు రోజులు ఉన్నాయి. మొదటిది ఫస్ట్ సినిమా 'జల్లు'కు ఫస్ట్ కెమెరా పెట్టి యాక్షన్ అని చెప్పిన రోజు. ఇందులో నేను, ధనరాజు, చిత్రం శీను, లెజెండరీ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ నటించాము. నలుగురికీ ఫస్ట్ డే ఫస్ట్ షాట్, నా మీద డైలాగ్. ఆ టైంలో భయపడుతున్నానని పక్కకు తీసుకెళ్లి ఎమ్మెస్ నారాయణ గారు "ఫస్ట్ డే ఫస్ట్ షార్ట్ క్లోజ్ షాట్ దొరకడం ఎంత కష్టమో తెలుసా?" అని అడిగారు. "75 అడుగుల స్క్రీన్ మీద నీ ఒక్కడి మొహమే కనిపిస్తోందంటే... యావత్ ప్రపంచం సినిమాను కనీసం ఒక్కసారి చూసినా జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది. అంత అదృష్టం ఎవరికి దొరకదు" అని చెప్పారు. సెకండ్ కలర్ ఫుల్ డే 'జబర్దస్త్' అనే ఒక అద్భుతమైన ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ డే ఫస్ట్ స్కిట్ నేను విన్ అవ్వడం, నేనే కాలు పెట్టి స్టార్ట్ చేయడం. థర్డ్ కలర్ ఫుల్ డే నా పెళ్లి రోజు. ఫోర్త్ కలర్ ఫుల్ డే నా పెద్ద కూతురు పుట్టినరోజు.
నూకరాజు : అప్పట్లో జబర్దస్త్ టీంలంటే చలాకి చంటి, చమ్మక్ చంద్ర, ధనాధన్ ధన్ రాజ్, వేణు వండర్స్... ఇలా ఆరేడు మంది చేసేవాళ్ళు. ఆ టైంలో మీకు ఎవరైనా కాంపిటీషన్ వస్తున్నట్టుగా అనిపించిందా?
చంటి : ఎదుటివాడు మనకు కాంపిటేటివ్ అని అనుకుంటే అదే మన ఫస్ట్ డ్రాబ్యాక్ అవుతుంది. వాడి ట్రాక్ వాడిది మన ట్రాక్ మనది. అదృష్టం బాగుండి వాడు నాలుగు మెట్లు ముందు ఎక్కుతాడు మనం తర్వాత ఎక్కుదాం. కానీ లేటుగా ఎక్కినోడే లైఫ్ లాస్ట్ వరకు నిలబడతాడు.
నూకరాజు : 'గుట్ట కింద గుంపు చెట్ల' అనే సాంగ్ మీ ఫేవరెట్ అంట కదా?
చంటి : ఆ సాంగ్ ఎవరికైనా తెలుసా అసలు?
నూకరాజు : ఎవరు పాడారు పేర్లు తెలుసుకోవా? నూకరాజు, ప్రభ అనే సింగర్స్ పాడారు.
చంటి : లేడీ సింగర్ బాగుండాలి, మేల్ సింగర్ ను తీసేయండి.
నూకరాజు : బేసిగ్గా 'జబర్దస్త్'లో ప్రతి టీంలో నుంచి వాళ్ళ శిష్యులు ఎవరో ఒకరు టీం లీడర్స్ అయ్యారు. కానీ చలాకీ చంటి అంటే పదిమంది గుర్తొస్తారు. అందులో మీ ఫేవరెట్ ఎవరు?
చంటి : అందరూ ఫేవరెట్.
నూకరాజు : రష్మీ, సుధీర్, ప్రదీప్.. ఈ ముగ్గురిలో మీ ఫేవరెట్ ఎవరు?
చంటి : రష్మీ బెస్ట్.
నూకరాజు : మీరు మంచి ఫుడ్డీ కదా. వెజ్జా, నాన్ వెజ్ ఇష్టమా?
చంటి : వెజ్... నేను నాన్ వెజ్ తినను.
నూకరాజు : నా జీవితంలో ఇలాంటి ఇబ్బంది మరోసారి రావద్దు అని అన్పించిన రోజేంటి?
చంటి : రెండేళ్ల క్రితం నేను హాస్పిటల్ లో పడి, బయటకు వచ్చాక... ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డాను. ఒకరోజు ఒకరిని హెల్ప్ అడిగితే.. గంట ముందు ఫోన్ చేసి ఉంటే బాగుండు అని సమాధానం చెప్పాడు. ఆరోజు అనిపించింది జీవితంలో వాడికి ఫోన్ చేయొద్దని. అలాంటి రోజు జీవితంలో వాడితో పాటు ఎవ్వరికి రావద్దు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

