UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
UP wedding : యూపీలో బరేలీలో పెళ్లి జరగడానికి ముందు వరుడు రూ.20 లక్షలు, బ్రెజా కారు కట్నంగా డిమాండ్ చేశాడు. దాంతో ఆ పెళ్లి కూతురు వెంటనే పెళ్లి రద్దు చేసుకుంది.

UP bride calls off wedding: పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వరుడు.. పెళ్లి మండపం బయటే గుర్రంపై ఉండిపోయాడు. పెళ్లి జరగలేదు. చివరికి పెళ్లి కాని ప్రసాద్ లా ఇంటికెళ్లిపోయాడు. దీనికి కారణం పెళ్లి చేసుకోవాలంటే బ్రెజ్జా కారు.. ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయం తెలిసిన పెళ్లి కూతురు.. ఇలాంటి వాళ్లతో పెళ్లి వద్దని చెప్పి పంపేసింది.
బరేలీలో రెండు కుటుంబాలు తమ పిల్లలకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మే నెలలో సిటీ హోటల్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీనికి అమ్మాయి కుటుంబం రూ.3 లక్షలు ఖర్చు చేసింది. అల్లుడికి బంగారు ఉంగరం, చైన్‌తో పాటు రూ.5 లక్షల నగదు ఇచ్చారు. అల్లుడి తండ్రి రామ్ అవతార్ మొదట తమకు మొదట కట్నం ఏమీ అవసరం లేదని.. జత బట్టలు మాత్రం చాలని చెప్పాడు. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు అల్లుడి ఇంటికి సంప్రదాయకంగా వచ్చినప్పుడు ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఇతర గృహోపకరణాలు, బంగారు ఆభరణాలు, రూ.1.20 లక్షలు నగదు సంప్రదాయకంగా ఇచ్చారు. కానీ అది సరిపోదని..తమకు కారు, ఇరవై లక్షల నగదు కావాల్సిందేనని వారు పట్టుబట్టారు.
మా కూతురు కోసం అంతా చేస్తున్నాం..వీరు ఇంత కట్నపిశాచులని తెలియలేదని అమ్మాయి తండ్రి మథనపడ్డాడు. వరుడి కుటుంబం మొత్తం బంగారు ఆభరణాలు తీసుకుంది. పెళ్లి కోసం అమ్మాయి తండ్రి పదిహేను లక్షల వరకూ ఖర్చు పెట్టాడు. శుక్రవారం రాత్రి సదర్ బజార్‌లోని పెళ్లి మండపానికి వరుడి కుటుంబం ఆలస్యంగా వచ్చింది. పెళ్లి వేడుకను ప్రారంభించే సమయంలో వరుడు రిషభ్ ఆకస్మికంగా రూ.20 లక్షలు నగదు, బ్రెజా కారును వెంటనే ఇవ్వమని డిమాండ్ చేశాడు. వధువు కుటుంబం కారు ఏర్పాటు చేయడానికి సమయం లేదు, తర్వాత ఇస్తాం అని వేడుకున్నా ఒప్పుకోలేదు. ఇవ్వకపోతే పెళ్లి జరగదని బెదిరించారు.
ఈ విషయం తెలిసిన పెళ్లి కూతురు మండపానికి వచ్చింది. కట్నం కోసం మా కుటుంబాన్ని అవమానిస్తున్నవాడు, భవిష్యత్తులో నన్ను గౌరవిస్తాడా? నేనే ఈ అబ్బాయిని వదిలేస్తున్నాను...వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. పెళ్లి సమయంలో కారు, రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. నా తండ్రి ఎలా ఏర్పాటు చేస్తాడు? అందరి ముందు నా సోదరుడిని తిట్టారు. అందుకే పెళ్లి తిరస్కరించాను. ఎలాంటి అమ్మాయి ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోదని పెళ్లి కూతురు స్పష్టం చేసింది.
A wedding in Uttar Pradesh’s Bareilly district was called off after the groom’s family allegedly demanded a Brezza car and ₹20 lakh in dowry moments before the vows. Despite the bride’s family claiming they had already fulfilled earlier demands, the groom’s side refused to… pic.twitter.com/KRYAP0iDFS
— Mid Day (@mid_day) December 15, 2025
పెళ్లి ఫిక్స్ చేసేటప్పుడు ఒక సెట్ బట్టలు మాత్రమే అన్నారని ఇప్పుడు కట్నం డిమాండ్ చేస్తున్నారని వధువు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్థలానికి చేరుకుని అల్లుడు రిషభ్, తండ్రి రామ్ అవతార్ ను అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకోవాల్సిన ఆ వరుడు.. జైల్లో ఉన్నాడు.





















