SS Rajamouli Video on Seize the Lion | కటకటాల వెనక్కి సింహం...రాజమౌళి పెట్టిన పోస్ట్ అర్థం ఇదే | ABP Desam
ఎస్ ఎస్ రాజమౌళి తన కొత్త సినిమాను మొదలుపెట్టేశారు. సూపర్ స్టార్ మహేశ్ హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్యాన్ వరల్డ్ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైనట్లు అర్థమవుతోంది. ఇందుకు తగిన హింట్ రాజమౌళినే ఇచ్చారు. గతంలో సింహం బొమ్మ ముందు నిలబడి నేను Bob తో ఉన్నానని పోస్ట్ పెట్టిన రాజమౌళి ఇప్పుడు అదే సింహంను సెల్ లో పెట్టి పాస్ పోర్టు లాక్కున్నాని వీడియో పెట్టారు. పైగా ఓ కన్నింగ్ నవ్వుతో..స్పైడర్ సినిమాలో విలన్ మ్యూజిక్ పెట్టి ఓ లుక్కు ఇచ్చారు రాజమౌళి. దాని అర్థం బాబ్ ను బంధించాను. పాస్ పోర్ట్ కూడా లాక్కున్నాను. ఇక ఆయన స్వేచ్ఛగా బయట తిరగలేడు అని అర్థం అంటూ ఫ్యాన్స్ రకరకాల థియరీలు అల్లేస్తున్నారు. జనరల్ గా మహేశ్ బాబు విదేశాలకు ఎక్కువగా ట్రిప్స్ వేస్తుంటారు. షెడ్యూల్ మధ్య గ్యాప్ వచ్చినా...సినిమా టూ సినిమా స్పేస్ ఉన్నా ఫారెన్ వెళ్లిపోవటం మహేశ్ బాబీ. అందుకే పాస్ పోర్ట్ లాగేసుకున్నాను..ఆయన ఇంక ఎక్కడికి వెళ్లలేడంటూ రాజమౌళి అలా పాస్ పోర్ట్ తో స్మైల్ ఇచ్చారన్నమాట. ఆ కన్నింగ్ స్మైల్ ఎందుకు అంటే...జనరల్ గా రాజమౌళి ఏ సినిమాకైనా మూడు నుంచి ఐదేళ్లు హీరో టైమ్ ను తినేస్తారని ఆయనపై హీరోలంతా ఫన్నీగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అందుకే బాబ్ కూడా ఇక నాలుగైదు ఏళ్లు బందీఖానా లోకి వెళ్లిపోయినట్లే అని ఫ్యాన్స్ నవ్వుతూనే ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు కామెంట్స్ లో.





















