Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ల కాంబినేషన్ లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావటంతో చిత్ర బృందం థాంక్యూ యూ మీట్ ను అరేంజ్ చేసింది. దీంతో మాట్లాడిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తనపై వచ్చిన ట్రోల్స్ కు మీమ్స్ కు సమాధానం ఇచ్చారు. "సోషల్ మీడియాలో 15రోజులుగా విధ్వంసం జరుగుతోంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో అనిల్ రావిపూడి దొరికిపోతాడు దొరికిపోతాడు అని ట్రోల్ చేశారు. వారు కోరుకున్నట్లుగానే గట్టిగా దొరికిపోయా. కానీ నేను దొరికింది ప్రేక్షకులకు. వాళ్ల హృదయాలకు దొరికిపోయా. మెగా అభిమానులు కనపడితే ముద్దు పెట్టేస్తున్నారు. నా ట్రోలర్స్, మీమర్స్ కి మళ్లీ చెప్తున్నా. నా మీద పాజిటివ్, నెగటివ్ ఏదైనా రాసుకోండి. నేను మాత్రం ఎంజాయ్ చేస్తా" - అనిల్ రావిపూడి, డైరెక్టర్





















