AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
ఎప్పటి నుంచో గుసగుసలకు పరిమితమైన ప్రాజెక్ట్ ఒకటి పట్టాలెక్కేసింది. అదే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా. ఈరోజు భోగి పండుగ సందర్భంగా AA 23 ని అనౌన్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై...అనిరుధ్ మ్యూజిక్ మాయాజాలంతో ఈ కొత్త సినిమా వస్తున్నట్లు అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. అనౌన్స్మెంట్ వీడియో కూడా చాలా డిఫరెంటెంగా ఉంది. ఏదో వెస్ట్రన్ స్పెగాటీ జంగిల్ బ్యాక్ డ్రాప్ కథలా సింహాలు, నక్కలు, గుర్రాలతో వీడియోను డిజైన్ చేశారు. బన్నీ గుర్రంపై కూర్చోగా చుట్టూ కొన్ని నక్కలు, తోడేళ్లు వచ్చి అరిస్తే సింహం గర్జించినట్లు అవన్నీ పారిపోయినట్లుగా ప్రజెంట్ చేశారు. మరి ఇది కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా డ్రగ్స్ మాఫియా, గ్యాంగ్ లతో బ్యాక్ డ్రాప్ తో LCU తో లింక్ అయ్యి వస్తుందో...లేదా బన్నీకోసం సపరేట్ గా రాసుకున్న స్టాండలోన్ ఫిలిమో చూడాలి. రజినీ కాంత్ తో తీసిన కూలీ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా కూడా పుష్పతో మంచి ఊపు మీదున్న బన్నీని సినిమాకు ఒప్పించాడంటే లోకి ఈసారి ఏదో బలమైన స్క్రిప్ట్ తోనే వచ్చి ఉంటాడని అప్పుడే ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ మొదలయ్యాయి.





















