అన్వేషించండి

iPhone 17e Launched: 48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు

iPhone 17e Specifications: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత iPhone 17e లాంచ్ అయింది. ప్రధాన అప్‌గ్రేడ్‌గా ఇది A19 చిప్‌సెట్‌తో వచ్చింది. శాటిలైట్ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

iPhone 17e Feature, Price: యాపిల్ కంపెనీ ఎట్టకేలకు ఐఫోన్ 17eని లాంచ్ చేసింది. ఇందులో A19 ప్రాసెసర్‌తో సహా పలు ఫీచర్లలో అప్‌గ్రేడ్లు అందించారు. అయితే, యాపిల్ ఈ ఫోన్‌లో డైనమిక్ ఐలాండ్ ఇస్తుందని ముందుగా అంచనా వేసినా, అది అందుబాటులోకి రాలేదు. ఈ మోడల్ నాచ్‌తోనే లాంచ్ అయింది. ఐఫోన్‌ 17ఈలో ఏమేం ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ వేటితో పోటీ పడుతుంది, దీని కోసం మీరు ఎంత ఖర్చు చేయాలి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఐఫోన్ 17e స్పెసిఫికేషన్లు
ఈ ఐఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే ఇచ్చారు. ఇది 1200 నిట్స్ పీక్ HDR బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మొబైల్‌పై గీతలు పడకుండా చూసేందుకు, గ్లేర్ (బ్రైట్‌నెస్) తగ్గించడానికి దీనిపై 'సిరామిక్ షీల్డ్ 2' (Ceramic Shield 2) ఇచ్చారు. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐఫోన్ 17eకి IP68 రేటింగ్ లభించింది. ప్రాసెసర్ విషయానికి వస్తే, యాపిల్ ఇందులో ఐఫోన్ 19 లో ఉండే A19 చిప్‌సెట్‌ను అమర్చింది. ఇది అడ్వాన్స్‌డ్ 3nm టెక్నాలజీతో రూపొందించారు. ఇది పాత మోడళ్లతో పోలిస్తే వేగవంతమైన పనితీరు అందిస్తుంది. ఆన్-డివైస్ AI ప్రాసెసింగ్ కోసం ఇందులో 16 కోర్ న్యూరల్ ఇంజిన్ అమర్చారు. .

కెమెరా, బ్యాటరీ
ఐఫోన్ 17e వెనుక భాగంలో 48MP సింగిల్ ఫ్యూజ్ కెమెరా సిస్టమ్ సెట్ చేశారు. ఇది 2x టెలిఫోటో ఆప్టికల్-క్వాలిటీని సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ కెమెరాతో యూజర్లు 24MPతో పాటు 48MP రిజల్యూషన్‌లో ఫొటోలు, వీడియోలు షూట్ చేయవచ్చు. అలాగే ఇందులో 4K వీడియో రికార్డింగ్ సౌకర్యం కూడా ఉంది. కొత్త చిప్‌సెట్, C1X మోడెమ్ వల్ల బ్యాటరీ సామర్థ్యం మెరుగైందని యాపిల్ పేర్కొంది. ఈ డివైస్ ఫాస్ట్ ఛార్జింగ్, మాగ్‌సేఫ్ (MagSafe), Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అయింది.

శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్లు
ఐఫోన్ 17e శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంది. సాధారణ నెట్‌వర్క్ కవరేజ్ లేని సమయంలో కూడా యూజర్లు శాటిలైట్ ద్వారా మెసేజ్‌లు, ఎమర్జెన్సీ SOS, రోడ్‌సైడ్ అసిస్టెంట్ సహా లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లను ఉపయోగించవచ్చు. దీనితో పాటు ఇందులో 'క్రాష్ డిటెక్షన్' ఫీచర్‌ను కూడా ఇచ్చారు. 

ధర ఎంత, అమ్మకాలు ఎప్పుడు ప్రారంభం?
యాపిల్ ఈ ఐఫోన్‌ను బ్లాక్, వైట్, సాఫ్ట్ పింక్ కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. భారత్‌లో ఐఫోన్ 17ఈ ప్రారంభ ధర రూ. 64,900గా నిర్ణయించారు. మార్చి 4 నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. మార్చి 11 నుండి ఈ ఐఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. కంపెనీ దీని స్టాండర్డ్ స్టోరేజ్‌ను 256GBకి పెంచింది. 

గూగుల్ పిక్సెల్ 10a (Google Pixel 10a)తో పోటీ
యాపిల్ ఈ లేటెస్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 10aతో పోటీ పడనుంది. కొద్ది రోజుల కిందట లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10aలో 6.3 అంగుళాల Actua డిస్ప్లే, టెన్సర్ G4 ప్రాసెసర్, వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10ఏ ఫోన్ ప్రారంభ ధర రూ. 49,999గా ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
Embed widget