అన్వేషించండి

Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?

Bengal Communists: దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నారు. ఒక్క సారి ఓడిపోయే సరికి ఇక మళ్లీ కనిపించకుండా పోయారు. బెంగాల్‌లో కమ్యూనిస్టుల పరిస్థితి ఇదే.

Why did the communists weaken in Bengal :  పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో 34 ఏళ్ల పాటు  తిరుగులేని శక్తిగా వెలిగిన వామపక్ష కూటమి  , ఒక్కసారి అధికారం కోల్పోయాక తిరిగి కోలుకోలేనంతగా బలహీనపడటం భారత రాజకీయాల్లో  ఒక హెచ్చరిక.    కమ్యూనిస్టుల తొలినాళ్ల విజయానికి  భూసంస్కరణలు  వెన్నెముకగా నిలిచాయి.  పేద రైతులకు భూమిని పంచడం ద్వారా వారు పటిష్టమైన ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు. అయితే, కాలక్రమేణా ఆ భూమి చిన్న చిన్న ముక్కలై, వ్యవసాయం లాభసాటిగా లేక యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం ప్రారంభమైంది. వ్యవసాయంపై ఆధారపడిన పాత తరం తర్వాత వచ్చిన కొత్త తరం ఆకాంక్షలను గుర్తించడంలో సిపిఎం విఫలమైంది.

 సింగూర్, నందిగ్రామ్: ఆత్మహత్యాసదృశ్య నిర్ణయాలు 

దాదాపు మూడు దశాబ్దాల పాలన తర్వాత, రాష్ట్రంలో పారిశ్రామికీకరణ అవసరమని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య వేగంగా అడుగులు వేశారు. అయితే, టాటా నానో ప్లాంట్ కోసం సింగూర్‌లోనూ, కెమికల్ హబ్ కోసం నందిగ్రామ్‌లోనూ బలవంతంగా భూసేకరణ చేపట్టడం పార్టీకి శాపమైంది.  వ్యవసాయం మన పునాది.. పరిశ్రమ మన భవిష్యత్తు  అనే నినాదం క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరలేదు. ఫలితంగా, తమను నమ్ముకున్న రైతాంగం తమకు వ్యతిరేకంగా మారుతుంటే కమ్యూనిస్టులు గ్రహించలేకపోయారు.

పార్టీ  క్యాడరైజేషన్, అహంకారం 

సుదీర్ఘ పాలన వల్ల పార్టీ క్యాడర్‌లో విపరీతమైన అహంకారం పెరిగింది. గ్రామాలు, పట్టణాల్లో చిన్న చిన్న సమస్యల నుండి పోలీసు స్టేషన్ల వరకు అంతా పార్టీ కనుసన్నల్లోనే నడిచేది. ఈ  పార్టీతంత్రం సామాన్య ప్రజలకు భారంగా మారింది. చివరకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్  మా-మతి-మానుష్ అంటే తల్లి-నేల-ప్రజలు నినాదంతో ప్రజల్లోకి వెళ్లినప్పుడు, కమ్యూనిస్టుల ఉక్కుకోటలు పేకమేడల్లా కూలిపోయాయి.

 మమతా బెనర్జీ  మార్కు రాజకీయం 

2011లో అధికారం కోల్పోయిన తర్వాత, కమ్యూనిస్టుల ఓటు బ్యాంకును మమతా బెనర్జీ తన సంక్షేమ పథకాలతో పూర్తిగా తనవైపు తిప్పుకున్నారు. ఉచిత బియ్యం, సైకిళ్లు  , కన్యాశ్రీ వంటి పథకాలు గ్రామీణ ఓటర్లను టిఎంసికి శాశ్వత మద్దతుదారులుగా మార్చాయి. కమ్యూనిస్టులు సిద్ధాంతాలకే పరిమితం కాగా, మమత ప్రత్యక్ష ప్రయోజనాలపై దృష్టి పెట్టారు.

 బీజేపీ ఆవిర్భావం - కనుమరుగైన వామపక్షాలు 

కమ్యూనిస్టులు బలహీనపడటంతో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి బీజేపీకి అవకాశం దక్కింది.  ముందు మమతను దించాలి, ఆ తర్వాత మనల్ని మనం చూసుకోవచ్చు  అనే భావనతో కమ్యూనిస్టుల ఓటు బ్యాంకులో గణనీయమైన భాగం బీజేపీ వైపు మళ్లింది. 2019 ఎంపీ ఎన్నికలు,  2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు ఒక్క సీటు కూడా గెలవలేక సున్నాకే పరిమితం కావడం వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
 
సిద్ధాంతపరమైన మొండితనం, మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోవడం,  ప్రజల మనోభావాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం బెంగాల్ కమ్యూనిస్టులను పతనం అంచుకు నెట్టాయి. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో వారు మనుగడ కోసం పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.                    

 

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget