Telangana Latest News:ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Telangana Latest News:ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కసరత్తును కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తి చేసింది. ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే

Telangana Latest News:తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 3వ తేదీన ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఎవరెవర్ని టీంలోకి తీసుకోవాలని అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఇవి చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైన జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం కేబినెట్ మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. దీంతో కులాల సమీకరణాలు లెక్కలు వేసుకొని జట్టులో మార్పులు చేర్పులు చేయనున్నారు. ఇద్దరు బీసీలకు, ఎస్సీలకు, రెండు రెడ్డీలకు మంత్రిపదవులు కేటాయించనున్నారు. మరొకటి కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. ఇది బంజారా సామాజిక వర్గానికి ఇవ్వాలా లేకుంటే ముస్లింకు ఇవ్వాలనే చర్చ కూడా జరిగింది. దీనిపై కూడా క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో కొన్ని జిల్లాల నుంచి ప్రాధాన్యత లేదు. అలాంటి జిల్లాల్లో ఆదిలాబాద్ ఒకటి. అందుకే ఆదిలాబాద్ నుంచి సీనియర్‌కు చోటు కల్పించనున్నారు. ఈ అంచనాలతో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పదవి ఖాయంగా కనిపిస్తోంది. రెడ్డి సామాజికి వర్గానికి సంబంధి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ మధ్య బీసీలకు 42శాతం కల్పించాలని అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించింది. దీంతో ఇప్పుడు చేసే మంత్రివర్గంలో బీసీలకు ఆ మేరకు ప్రాధాన్యత లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వినిస్తాయి. అందుకే ఆ లెక్కలను కూడా కాంగ్రెస్ చూసుకొని మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతోంది.
బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మరో బీసీని తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ పోస్టు కోసం ఇద్దరి మధ్య పోటీ ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ రేసులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముందంజలో ఉన్నారు. విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

