Kalki Koechlin: నిర్మాతను ఫోర్క్‌తో పొడిచేద్దాం అనుకున్న హీరోయిన్... ఎందుకో తెలుసా?
హిందీ సినిమాలు చూసే ప్రేక్షకులకు హీరోయిన్ కల్కి కొచ్చిన్ తెలిసే ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో తనకు ఓ నిర్మాత కోపం తెప్పించారని, టేబుల్ మీద ఉన్న ఫోర్క్ తీసుకొని పొడిచి చంపేద్దామనుకున్నానని ఆవిడ పేర్కొన్నారు.

హిందీ సినిమాల్లో నటించిన కల్కి కొచ్చిన్ (Kalki Koechlin) తెలుసా? ఆవిడ ఫ్రెంచ్ యాక్టర్. హిందీ సినిమాలతో భారతీయ ప్రేక్షకులకు దగ్గర అయింది. విలక్షణ పాత్రలు చేయడమే కాదు... మాటల్లోనే తెగువ చూపించడం కల్కి స్టైల్. ఒక అంతర్జాతీయ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నిర్మాత తనకు కోపం తెప్పించిన విషయాన్ని చెప్పుకొచ్చింది కల్కి.
టేబుల్ మీద ఫోక్ తీసుకుని పొడిచేద్దాం అనుకున్నా
బాలీవుడ్ నిర్మాత ఒకరితో లంచ్ చేయడానికి కల్కి కొచ్చిన్ వెళ్లారట. అక్కడ పిచ్చాపాటిగా మాట్లాడుతున్న సమయంలో సదరు నిర్మాత విడాకులు ఇచ్చేసిన మాజీ భార్య గురించి ప్రస్తావన తీసుకొచ్చారట. నిర్మాత మాజీ భార్య ఒక హీరోయిన్ అని, ఆవిడ అందంగా కనిపించడం కోసం బాడీలో ఫిల్లర్స్ వేయించుకున్నారని, తనను కూడా ఆ విధంగా చేయించుకోమని నిర్మాత సలహా ఇచ్చాడని కల్కి తెలిపింది.
బుగ్గలు మరీ నొక్కేసినట్లు ఉన్నాయని, పెదవులు బాలేదని, నవ్వు వచ్చిన సమయాలలో ముఖం అందంగా కనిపించడం లేదని, తన మాజీ భార్యలా నువ్వు కూడా ఫిల్లర్స్ వేయించుకుంటే అందంగా తయారవుతావని కల్కికి సదరు నిర్మాత సలహా ఇచ్చారు. ఆ టైంలో తనకు వచ్చిన కోపానికి టేబుల్ మీద ఉన్న ఫోర్క్ తీసుకుని ఆ నిర్మాతను పొడిచేద్దాం అనుకున్నట్లు కల్కి వివరించారు. అయితే కొంత సేపటికి తన కోపాన్ని తగ్గించుకుని మామూలుగా అక్కడి నుంచి వచ్చేసినట్లు తెలిపారు.
Also Read: 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
View this post on Instagram
హిందీ హీరోయిన్లు కొంత మంది అందంగా కనిపించడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. కొంత మంది ఫిల్లర్స్ కూడా వేయించుకున్నారు. అటువంటివి ఏవీ లేకుండా సహజంగా కనిపించాలి అనుకునే హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆ జాబితాలో కల్కిని వేసుకోవచ్చు.
'ఏ జవానీ హై దివానీ', 'జిందగీ నా మిలేగి దుబారా', 'దేవ్ డి', 'గల్లీ బాయ్' తదితర సినిమాలలో కల్కి నటించారు. ఆవిడ కొన్ని తమిళ సినిమాలు కూడా చేశారు. కోలీవుడ్ హీరో మురళి తనయుడు ఆకాశ్ మురళి, స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ జంటగా నటించిన 'ప్రేమిస్తావా' సినిమాలో కూడా కల్కి ఒక పాత్ర చేశారు. ఓటిటి ప్రాజెక్ట్స్, సినిమాలతో ఆవిడ బిజీగా ఉంటున్నారు.
Also Read: నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార... ఆ కండిషన్స్ దెబ్బకు 30 కోట్లు లాస్!?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

