Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
మొదటి టీ20 వర్షం కారణంగా రద్దైంది..రెండో దాంట్లో గెలిచి ఆసీస్ పై పైచేయి సాధించాలని మనోళ్లు పడిన ఆశలన్నీ తుస్సయ్యాయి. అభిషేక్ శర్మ, హర్షిత్ రానా తప్ప మరో బ్యాటర్ కనీసం 10 పరుగులు కూడా చేయలేకపోయిన వేళ...రెండో టీ20 లో భారత్ పై ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన ఆసీస్ మనసులో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యింటుందో. నాథన్ ఎల్లిస్, హేజిల్ వుడ్, బార్ట్ లెట్ నిప్పులు చెరిగే బంతులకు భారత టాప్ అండ్ మిడిల్ ఆర్డర్స్ లు కుప్పకూలాయి. గిల్ 5, సంజూ శాంసన్ 2, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 1, తిలక్ వర్మ 0, అక్సర్ పటేల్ 7, శివమ్ దూబే 4 అంటూ అంతా కలిసి స్కోరుబోర్డును సెల్ ఫోన్ నెంబర్ లా మార్చి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫైర్ స్ట్రామ్ అభిషేక్ శర్మ వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడి 37 బాల్స్ లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 68పరుగులు చేశాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే 49పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండేదో. అభిషేక్ కి తోడు గంభీర్ చేసిన ప్రయోగం ఫలించి హర్షిత్ రానా సక్సెస్ అయ్యాడు. 33 బాల్స్ లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 35పరుగులు చేసిన హర్షిత్ రానా టీమిండియా కనీసం 125పరుగులు చేసేలా చేయగలిగాడు. ఆ తర్వాత 126పరుగుల ఛేజింగ్ లో ఆసీస్ టాప్ 3 కాసేపు అదరగొట్టారు. కెప్టెన్ మిచ్ మార్ష్ 26 బాల్స్ లో 4 సిక్సర్లు బాది 46పరుగులు చేస్తే..హెడ్, ఇంగ్లిస్ మార్ష్ కి సపోర్ట్ చేశారు. భారత బౌలర్లు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ పుంజుకుని రెండేసి వికెట్లు తీసి మంచి ప్రదర్శనే చేసినా టార్గెట్ చాలా తక్కువగా ఉండటంతో ఆస్ట్రేలియా ఇంకా 6 ఓవర్లుపైగా ఉండగానే...6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేజ్ చేసేసింది. ఇక భారత్ ఈ టీ20 సిరీస్ గెలవాలంటే మిగిలి ఉన్న మూడు మ్యాచ్ ల్లోనూ నెగ్గి తీరాల్సిందే.





















