Allu Sirish Nayanika : ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
Allu Sirish Nayanika Engagement : టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నయనికల నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. తన ఇన్ స్టాలో శిరీష్ ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Allu Sirish Nayanika Engagement Ceremony : అల్లు వారింట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నయనికల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో శిరీష్ నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు అతి కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు కుటుంబ సభ్యులతో సందడి చేశారు.
తనకు నయనికతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'ఫైనల్లీ ఎంగేజ్మెంట్ విత్ లవ్ ఆఫ్ మై లైఫ్ నయనిక' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు విషెష్ చెబుతున్నారు. త్వరలోనే శిరీష్ నయనిక వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే, ఇటీవల వర్షం కారణంగా ఎంగేజ్మెంట్‌కు ఆటంకం కలిగిందని శిరీష్ సోషల్ మీడియాలో వెల్లడించగా శుక్రవారం వాతావరణం అనుకూలించడంతో వేడుక ఘనంగా జరిగింది.
View this post on Instagram
నెల రోజుల క్రితం శిరీష్ తనకు కాబోయే భార్యతో ఈఫిల్ టవర్ దగ్గర దిగిన ఫోటోను షేర్ చేశారు. నయనికతో ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు చెప్పారు. ఇరు కుటుంబాలు తమ ప్రేమను స్వీకరించినట్లు వెల్లడించారు. అల్లు శిరీష్ 'గౌరవం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో మూవీస్‌లో నటించారు. గతేడాది 'బడ్డీ' మూవీలో నటించారు. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నారు.





















