Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Varanasi Movie : రాజమౌళి 'వారణాసి' కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేరళ పురాతన విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.

Mahesh Babu Kalaripayattu Training For Varanasi Movie : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రాజెక్టుల్లో మహేష్ బాబు, రాజమౌళి 'వారణాసి' ఒకటి. టైటిల్ గ్లింప్స్‌తోనే వరల్డ్ మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు దర్శక ధీరుడు. మూవీలో 'రుద్ర'గా సూపర్ స్టార్ మహేష్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పలు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ మూవీ కోసం మహేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆ యుద్ధ విద్యలో ట్రైనింగ్
'వారణాసి' మూవీలో డైరెక్టర్ రాజమౌళితో పాటు తెలుగు ఇండస్ట్రీ, అభిమానులు గర్వపడేలా చేస్తానని ఈవెంట్‌లో చెప్పారు మహేష్ బాబు. ఈ మూవీ కోసం ఆయన మొదటి నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. లుక్స్ దగ్గర నుంచీ యాక్షన్ సీన్స్ వరకూ అన్నింటిలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా, ఈ మూవీ కోసం కేరళ పురాతన విద్య 'కలరిపయట్టు'లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఫేమస్ మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు ట్రైనర్ హరికృష్ణన్ ఆయనకు శిక్షణ ఇస్తున్నారు. మహేష్‌కు శిక్షణ ఇస్తున్న హరికృష్ణన్ ఆయనతో తన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకుంటూ ఫోటోను ఇన్ స్టాలో పంచుకున్నారు.
View this post on Instagram
Also Read : తలైవాతో నీలాంబరి - 'నరసింహ' మూవీలో ఐకానిక్ సీన్... థియేటర్‌లో ఎంజాయ్ చేసిన రమ్యకృష్ణ
'గర్వంగా ఉంది'
భారతీయ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుకు పురాతన యుద్ధ విద్య 'కలరిపయట్టు'లో ట్రైనింగ్ ఇవ్వడం గర్వంగా ఉందని ట్రైనర్ హరికృష్ణన్ తెలిపారు. 'ఆయన జీవన శైలి, అతిథి మర్యాదలు నాకు చాలా స్ఫూర్తిదాయకం. ఈ అవకాశం ఇచ్చినందుకు నాజర్ గారికి, అంగీకరించినందుకు దర్శకుడు రాజమౌళి గారికి కృతజ్ఞతలు' అంటూ రాసుకొచ్చారు. కేరళ పురాతన యుద్ధ విద్యల్లో కలరిపయట్టు ఒకటి. కత్తులు, కర్రల వంటి సంప్రదాయ ఆయుధాలతోనే శారీరక శిక్షణతో పాటు ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉండేలా ట్రైనింగ్ ఇస్తారు.
'వారణాసి' బడ్జెట్ ఎంత?
రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌లో 'వారణాసి' తెరకెక్కిస్తుండగా మొన్నటివరకూ రూ.1000 కోట్ల బడ్జెట్ అనే టాక్ వినిపించింది. బడ్జెట్ విషయంలో తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని ప్రొడ్యూసర్‌ను జక్కన్న కోరారట. తాజాగా కపిల్ శర్మ షోలో 'ఈ మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లా?' అంటూ ఎదురైన ప్రశ్నకు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నవ్వుతూనే సమాధానాన్ని దాటేశారు. ఇదే ఇంటర్వ్యూలో 'మీరు ఏం చెప్పదలుచుకున్నారు?. బడ్జెట్‌లో సగం నా అకౌంట్లోకే పోయిందా?' అంటూ ఆమె నవ్వులు పూయించారు. అయితే, ఈ మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లు అని తెలుస్తోంది.
మహేష్ బాబు 'రుద్ర' పాత్రలో, ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ 'కుంభ'గా నటిస్తున్నారు. మహేష్ తండ్రి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ మూవీని నిర్మిస్తున్నారు. 2027, సమ్మర్‌లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















