Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Bigg Boss Telugu Season 9: జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్నాడు. ఆయన ఎక్కడ పొరబాటు చేశారు, టైటిల్ కోల్పోవడానికి కారణాలు ఇవే.

Emmanuel eliminated From Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పూర్తయింది. టైటిల్ విన్నర్ గా సోల్జర్ కళ్యాణ్ నిలిచాడు. తనూజ రన్నరప్ గా సెకండ్ ప్లేస్ సాధించింది. విన్నర్ ఈ ఇద్దరి లోనే ఉంటారని రివ్యూవర్ లూ.. బిగ్ బాస్ ఫాన్స్ గత నాలుగు వారాలుగా ఊహిస్తూనే వచ్చారు. అయితే సీజన్ మొదట్లో విన్నర్ అవుతాడని భావించిన జబర్దస్త్ ఇమ్మానుయేల్ నాలుగో స్థానం లోనే ఉండిపోవాల్సి రావడం ఆయన ఫ్యాన్స్ నీ ఫ్యామిలీ ని షాక్ కు గురించేసింది. సీజన్ అంతా టాస్క్ లు పరంగా.. కామెడీ పరంగా అందరినీ ఎంటర్టైన్ చేసిన ఇమ్మానుయేల్ టైటిల్ రేస్ లో ఆమడ దూరం లోనే నిలబడిపోవడం వెనుక తను చేసిన పొరబాట్లే కారణం అయ్యాయి.
మొదటి 5 వారాలూ ఇమ్మానుయేల్ నే విన్నర్ మెటీరియల్
నిజానికి బిగ్ బాస్ లో కమెడీయన్స్ ఎంత కష్టపడినా విన్నర్ కాలేరని ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. సీజన్ వన్ లో సంపూర్ణేష్ బాబు మధ్యలోనే వెళ్లిపోవడం, జబర్దస్త్ ధనరాజు కూడా ఎలిమినేట్ అయిపోవడం దగ్గర నుండి పోయిన సీజన్ లో రోహిణి, అవినాష్ లు అద్భుతగా టాస్క్ ల్లో పోటీ పడినా వారు విన్నర్ కాలేక పోయారు. ఇక కమెడియన్స్ ని బిగ్ బాస్ విన్నర్ గా ఆడియన్స్ ఓట్ వేయరు అనే అభిప్రాయానికి వచ్చేసిన సమయంలో ఇమ్మానుయేల్ ఈ సీజన్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చప్పగా సాగిన ఈ సీజన్ ని ఆదుకుంది ఇమ్మానుయేల్ నే. ఒకవైవు సంజన తన ప్రాంక్స్ తో సీజన్ లో చలనం తెస్తే తన జోక్స్, టాస్క్ ల్లో ఫైర్ తో ఇమ్మానుయేల్ ఈ సీజన్ ని పరుగులెత్తించాడు. దానితో మొదటి 5,6 వారాల వరకూ ఇమ్మానుయేల్ నే టైటిల్ విన్నర్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ ఊపు ను తానే చెడగొట్టుకున్నాడు.
నామినేషన్ అంటే భయం... సేఫ్ గేమర్ గా ముద్ర
ఇమ్మానుయేల్ కి అతి పెద్ద భయం నామినేషన్. తాను ఆడుతున్న ఆట ను సొంతం గా బేరీజు వేసుకోవడం నిజమైన ఆటగాడి లక్షణం. ఇమ్మానుయేల్ కి అది చేత కాలేదు. నామినేషన్ లోకి వెళితే చాలు ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాడో అని భయపడిపోయేవాడు. ఒకపక్క నాగార్జున, మధ్యలో వచ్చిన హైపర్ ఆది, అవినాష్ లాంటివాళ్ళు నామినేషన్ కు భయపడకు అంటూ ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నా ఇమ్మానుయేల్ ఆ ధైర్యం చెయ్యలేకపోయాడు. బిగ్ బాస్ షో లో ఎన్నిసార్లు నామినేషన్ లోకి వస్తే అంత ఎక్కువగా క్రొత్త ఫ్యాన్స్ పుట్టుకు వస్తారు. అందుకే కాస్త రిస్క్ తీసుకునైనా తెలివైన ఆటగాళ్లు నామినేషన్ లోకి వచ్చేందుకు ట్రై చేస్తూ ఉంటారు.
గతంలో సన్నీ, అఖిల్, అమర్ లాంటి వాళ్ళు ఆ స్ట్రాటజీ వాడారు. ఈ సీజన్ లో కూడా సంజన టాప్ 5 వరకూ రాగలిగింది అంటే ఆ టెక్నీకే కారణం. కానీ ఇమ్మానుయేల్ మాత్రం ఆ డేర్ చెయ్యలేక సేఫ్ గేమ్ మొదలు పెట్టాడు. నామినేషన్ లోకి రాకపోవడం తో మొదటి 5,6 వారాల్లో వచ్చిన ఫ్యాన్ బేస్ తప్పు కొత్త ఫ్యాన్స్ రాలేదు. అదే ఆయన్ని టైటిల్ విన్నర్ కాకుండా ఆపేసింది. అలాగే సంజన ఆయన్ను ఒక కొడుకు లా భావించి అభిమానిస్తుంటే ఇమ్ము మాత్రం పెద్దగా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. సంజన నెగిటివిటీ మూట గట్టుకుంటుందేమో ఆమెతో ఉంటే తానూ నెగిటివ్ అయిపోతానేమో అన్నట్టు ఉండేది హౌస్ లో తన బిహేవియర్. ఇది కూడా ఆయన్ని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఓటింగ్ కి దూరం చేసింది. ఎప్పుడూ తనూజ, కళ్యాణ్, భరణి ఈ గ్రూప్ తోనే ఉండేందుకు ప్రయత్నించేవాడు.
నిజానికి వారి అందరికంటే ఇమ్మానుయేల్ నే స్ట్రాంగ్ ప్లేయర్. ఇది అందరూ గమనించారు.. ఇమ్మూ తప్ప. ఒళ్ళసారి రీతూ ఎలిమినేట్ అవగానే డిమాన్ పవన్ పురి విప్పి ఆడడం మొదలుపెట్టాడు. అన్ని భయాలు వదిలేసి డేరింగ్ గా ఆడడం తో డిమాన్ ఏకంగా ఇమ్మూను దాటుకుని టాప్ 3కి వెళ్లిపోయి 15 లక్షలు సాధించి హ్యాపీ గా బయటకు రాగా ఇమ్మానుయేల్ మాత్రం అది కూడా లేకుండా టాప్ 4 దగ్గరే నిలిచిపోయాడు. అందుకేనేమో ధైర్యే సాహసే లక్ష్మీ అంటారు. ఏమైనా బిగ్ బాస్ లో ఇమ్మానుయేల్ జర్నీ నెక్స్ట్ సీజన్ లో వచ్చే ఆటగాళ్ళకి ఒక ఉదాహరణ.
మనదగ్గర ఎంత బలం, టెక్నీక్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సత్తా ఉన్నా ధైర్యం చేయకపోతే గెలుపుకు ఆమడ దూరం లోనే ఆగిపోవాల్సి వస్తోంది.అయితే ఒక్క విషయం మాత్రం నిజం. ఇంతకాలం ఒక కమెడియన్ గానే ముద్ర పడిన ఇమ్మానుయేల్ క్రేజ్ తన టాస్క్ లతో మరింత పెరిగింది. బిగ్ బాస్ 9 కారణం గా ఆయనకి కేరీర్ పరంగా క్రొత్త అవకాశాలు వస్తాయి అనడం లో సందేహం లేదు. ఆల్ ది బెస్ట్ ఇమ్మానుయేల్ అలియాస్ ఇమ్మూ...!





















