అన్వేషించండి

Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

Best Crime Thriller Movies Telugu: తెలుగులో వచ్చిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఇదొకటి. ఇందులో క్రైమ్ ఒక్కటే కాదు... నేరానికి పాల్పడే వ్యక్తి పర్వర్షన్ కూడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతుళ్లను టార్గెట్ చేసే ఆ సినిమా ఏదంటే?

OTT Movie: అనగనగా ఒక ఊరు... సైకిల్ ఎక్కితే పది నిమిషాల్లో ఊరంతా చుట్టేసి రావచ్చు. ఆ ఊరిలో ఒకరికొకరు బాగా తెలుసు. అయితే... ఆ ఊరిలో వరుస హత్యలు గ్రామ ప్రజలు అందరినీ భయాందోళనలకు గురి చేస్తాయి. అదీ నవ వధువులను టార్గెట్ చేస్తూ... వాళ్లను అనుభవించి మరీ హత్యలు చేస్తాడో వ్యక్తి. ఆ వ్యక్తి కథ ఏమిటి? ఆ సినిమా ఎందులో ఉంది? అనేది తెలుసుకోండి.

కొత్త పెళ్లి కూతుళ్లను టార్గెట్ చేసే దోభీ...
భర్త తలతో పోలీస్ స్టేషన్ గడప ఎక్కిన భార్య!
అసలు కథలోకి వెళితే... ఓదెల అని ఓ ఊరు ఉంది. అందులో తిరుపతి (వశిష్ఠ ఎన్ సింహా) అని ఓ యువకుడు ఉన్నాడు. అతడికి పెళ్లి అయ్యింది. భార్య పేరు రాధ (హెబ్బా పటేల్). వంశపారంపర్యంగా వచ్చిన దోభీ వృత్తిని కంటిన్యూ చేస్తున్నారు. ఊరి ప్రజల మాసిన దుస్తులు తీసుకు వచ్చి ఉతకడం, ఆరేసి ఇస్త్రీ చేసి ఇవ్వడం ఆ దంపతుల పని. ఊరి ప్రజలందరి తలలో నాలుకలా ఉంటారు.

Also Readస్టార్ హీరోలైనా వీళ్ళిద్దరూ చెప్పింది చేయాల్సిందే... పూరి ఛాన్స్‌తో టాప్ ప్లేసుకు, ఈ అన్నదమ్ములు ఎవరో తెలుసా?

ఓదెల గ్రామ ప్రజల్లో భయాందోళనలకు కారణం తిరుపతి. పైకి అమాయకుడిగా నటించే అతను, కొత్తగా పెళ్లైన అమ్మాయిపై అఘాయిత్యం చేసి ఆ తర్వాత చంపుతూ ఉంటాడు. వరుస హత్యాచారాలకు కారణం ఎవరో తెలియక పోలీసులు విచారణ ముమ్మరం చేస్తుంటారు. అయితే... తిరుపతి చేసే పని పోలీసుల కంటే ముందు అతని భార్య రాధకు తెలుస్తుంది. దాంతో భర్తను చంపేసి అతని తల నరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతుంది. తెలుగులో వచ్చిన డిఫరెంట్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాల్లో ఇదొకటి. ఇంతకీ, సినిమా పేరు ఏదో గుర్తుకు వచ్చిందా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

ఆహా ఓటీటీతో పాటు యూట్యూబ్‌లోనూ!
Odela Railway Station OTT Streaming Platform: హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'. పూజితా పొన్నాడ, సాయి రోనక్ కీలక పాత్రల్లో నటించారు. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంపత్ నంది కథ అందించారు. కేకే రాధామోహన్ నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీ (AHA OTT)లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ వెర్షన్ యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్ తీశారు. ఆ సినిమా 'ఓదెల 2'లో తమన్నా ప్రధాన పాత్ర పోషించారు. ఆ చిత్రానికీ సంపత్ నంది కథ అందించగా... అశోక్ తేజ దర్శకత్వం వహించారు.

Also ReadAnantha Sriram: నేను సరస్వతి పుత్రుణ్ణి కాదు... ఆయనకు అనంత శ్రీరామ్ కౌంటర్?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఉస్తాద్ To మాస్ మూవీస్ జాతర - ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్
ఉస్తాద్ To మాస్ మూవీస్ జాతర - ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్
Do Deewane Seher Mein OTT : ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chitti Thalli OTT : కూతురి కోసం ఓ తండ్రి పడే ఆరాటం - ఓటీటీలోకి వచ్చేసిన 'చిట్టి తల్లి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కూతురి కోసం ఓ తండ్రి పడే ఆరాటం - ఓటీటీలోకి వచ్చేసిన 'చిట్టి తల్లి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sabdham OTT : కాలేజీ లైబ్రరీలో ఆత్మల మిస్టరీ - ఫైనల్‌గా ఓటీటీలోకి శబ్దం తెలుగు వెర్షన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కాలేజీ లైబ్రరీలో ఆత్మల మిస్టరీ - ఫైనల్‌గా ఓటీటీలోకి శబ్దం తెలుగు వెర్షన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Nashik Corporate Jihad: మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
This Week Theatrical Releases : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
AP Cabinet Reshuffle: మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Embed widget