Brahmanandam : రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం - హనుమాన్ చిత్రం అందించిన హాస్య బ్రహ్మ
Brahmanandam Met President : హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఆయన్ను శాలువాతో సత్కరించి గౌరవించగా... తాను స్వయంగా గీసిన హనుమాన్ చిత్రాన్ని ఆమెకు అందించారు.

Brahmanandam Met President Draupadi Murmu : స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. గత 3 రోజులుగా హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లిన బ్రహ్మీ రాష్ట్రపతిని కలిసి తాను స్వయంగా గీసిన ఆంజనేయుని చిత్రపటాన్ని అందించారు. రాష్ట్రపతి ముర్ము ఆయన్ను శాలువాతో సత్కరించి గౌరవించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్రహ్మానందం సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తీరిక సమయాల్లో ఆయనే స్వయంగా బొమ్మలు గీస్తారు. పలువురు సెలబ్రిటీలకు పలు సందర్భాల్లో వాటిని బహుమతులుగా ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రపతికి కూడా ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. సినిమాల విషయానికొస్తే... ఆయన నటించిన 'గుర్రం పాపిరెడ్డి' మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీలో ఆయన జడ్జి పాత్రలో నటించారు.
Also Read : ఒకే ఫ్రేమ్‌లో నాగ చైతన్య, శోభిత, సమంత! - డోంట్ కన్ఫ్యూజ్... అసలు నిజం ఏంటంటే?





















