Drishyam 3 Release Date : 'దృశ్యం 3' నుంచి బిగ్ అప్డేట్ - అఫీషియల్ రిలీజ్ ఎప్పుడంటే?
Drishyam 3 Update : సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మేరకు మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

Drishyam 3 Hindi Version Release Date Announced : క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా మూవీ లవర్స్‌కు ఆద్యంతం సస్పెన్స్‌తో పాటు థ్రిల్ పంచిన మూవీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే మూవీ 'దృశ్యం'. 2013లో మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అదే జోష్‌తో ఇతర భాషల్లోనూ రీమేక్ చేశారు.
ఇప్పటికీ రెండు పార్టులు రిలీజ్ కాగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇప్పుడు మూడో పార్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా 'దృశ్యం 3' హిందీ వెర్షన్ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
స్పెషల్ వీడియో
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, శ్రియ ప్రధాన పాత్రలో నటించిన 'దృశ్యం 3' మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అజయ్, శ్రియలతో పాటు అక్షయ్ ఖన్నా, టబు, ఇషితా దత్తా, రజత్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
#Drishyam3 on #DrishyamDay
— Ajay Devgn (@ajaydevgn) December 22, 2025
Aakhri hissa baaki hai.
In cinemas on 2nd October, 2026. https://t.co/b2Eo83h62p
Also Read : ఒకే ఫ్రేమ్‌లో నాగ చైతన్య, శోభిత, సమంత! - డోంట్ కన్ఫ్యూజ్... అసలు నిజం ఏంటంటే?
మరోవైపు, మలయాళంలోనూ 'దృశ్యం 3' షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే దీని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే, హిందీ వెర్షన్ కంటే ముందుగానే రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్ లాల్‌తో పాటు మీనా, ఆశా శరత్, సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక తెలుగులో వెంకటేష్, మీనా 'దృశ్యం' రీమేక్‌లో నటించారు.
దృశ్యం 1, 2 స్టోరీస్ ఏంటంటే?
పల్లెటూరిలో తన భార్య, ఇద్దరు పిల్లలతో సాఫీగా జీవితం సాగిపోయే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. ఊరిలో పలు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటుంటాడు. అలాంటి వారి జీవితంలో ఓ అనుకోని సంఘటన ఎదురవుతుంది. వారి పెద్ద కుమార్తె ఓ టూర్‌కు వెళ్లగా అక్కడ ఐజీ కుమారుడు ఆమె స్నానం చేస్తుంటే సీక్రెట్‌గా వీడియో తీస్తాడు. దీన్ని చూపించి ఆ అమ్మాయిని బెదిరిస్తాడు. అయితే, అనుకోని గొడవతో ఐజీ కుమారున్ని ఆ యువతి కొట్టి చంపేస్తుంది.
దీంతో హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని సేవ్ చేసేందుకు ఆ మిడిల్ క్లాస్ వ్యక్తి పక్కా ప్రణాళిక రచిస్తాడు. డెడ్ బాడీతో పాటు చిన్న ఆధారం కూడా దొరక్కుండా జాగ్రత్త పడతాడు. అలా తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. ఇక రెండో పార్టులో ఐదేళ్ల తర్వాత మళ్లీ కేసు రీ ఓపెన్ చేయగా అసలు ఆధారమే లేకుండా మళ్లీ పక్కా ప్లాన్ చేస్తాడు. రెండో పార్ట్ క్లైమాక్స్‌లో 'మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇకనైనా మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి' అంటూ ఐజీ కుటుంబానికి లేఖ రాస్తాడు. ఈ క్రమంలో 'దృశ్యం 3'లో ఏం జరుగుతుందా? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'దృశ్యం 3'తో క్లోజ్ చేస్తారా? లేక 'దృశ్యం 4' కూడా ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.





















