Naga Chaitanya Sobhita Dhulipala : ఒకే ఫ్రేమ్‌లో నాగ చైతన్య, శోభిత, సమంత! - డోంట్ కన్ఫ్యూజ్... అసలు నిజం ఏంటంటే?
Naga Chaitanya : నాగచైతన్య, శోభిత, సమంత కలిసి సెల్ఫీ దిగారంటూ నెటిజన్లు ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే, చై, శోభితతో పాటు ఆమె సోదరి 'సమంత' కలిసి సెల్ఫీ తీసుకున్నారు.

Naga Chaitanya Sobhita Dhulipala Samantha In Single Frame : అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, శోభిత దూళిపాళ, సమంత కలిసి ఫోటో దిగారా? ప్రస్తుతం ముగ్గురూ కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. అయితే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఇక్కడ సమంత అంటే హీరోయిన్ సామ్ కాదు. చై భార్య శోభిత సోదరి. ఆమె పేరు కూడా సమంతనే.
భార్య సోదరితో చై సెల్ఫీ
తన భార్య శోభిత సోదరి సమంతతో చై సెల్ఫీ దిగారు. దీంతో 'చై, శోభిత, సమంత కలిసి ఫోటో దిగారు' అంటూ ఈ ఫోటోను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. చై మాజీ భార్య పేరు, శోభిత సోదరి పేరు కూడా 'సమంత'నే కావడంతో అందరూ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
నాగచైతన్య, శోభిత కపుల్ ఇటీవలే మొదటి పెళ్లి రోజు వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శోభిత తమ పెళ్లి వీడియోను ఇన్ స్టాలో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శోభిత... బెస్ట్ మూమెంట్స్‌ను అప్పుడప్పుడు షేర్ చేసుకుంటుంటారు. ప్రస్తుతం చై, శోభిత, సమంత ఫోటో అంటూ ముగ్గురూ కలిసి దిగిన సెల్ఫీ వైరల్ అవుతోంది.
#NagaChaitanya #SobhitaDhulipala #Samanta pic.twitter.com/qoZGfhD2en
— Ananth (@ananthtalam) December 21, 2025
Also Read : తలైవాతో నీలాంబరి - 'నరసింహ' మూవీలో ఐకానిక్ సీన్... థియేటర్‌లో ఎంజాయ్ చేసిన రమ్యకృష్ణ
సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య, శోభిత దూళిపాళ గతేడాది డిసెంబర్ 4న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అటు, సమంత సైతం స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఇటీవలే రెండో వివాహం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే నాగచైతన్య 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ 'విశ్వకర్మ'లో నటిస్తున్నారు. శోభిత స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో 'వేట్టువం' మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.





















