అన్వేషించండి

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్

Phone Tapping case in Telangana | ఫోన్ టాపింగ్ కేసులో ముగ్గురు ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌ అధికారులను సిట్ అధికారులు మరోసారి విచారించారు.

Phone Tapping case | హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో అత్యున్నత పదవుల్లో కొనసాగిన ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ముఖ్యంగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను సాక్షులుగా విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. వీరితో పాటు సాధారణ పరిపాలన శాఖ (GAD) మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావును కూడా విచారించిన అధికారులు, అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ నంబర్ల మంజూరు, అందుకు పరిపాలనాపరమైన అనుమతులపై ఆయన్ని ప్రశ్నించారు. మాజీ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి నవీన్ చంద్రకు సిట్ నోటీసులు జారీ చేసింది.

ప్రభాకర్ రావును తిరిగి నియమించడంపై ఆరా తీసిన సిట్

ఫోన్ టాపింగ్ కేసు విచారణలో ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం, ఆయన వ్యవహారశైలిపై సిట్ దృష్టి సారించింది. పదవీ విరమణ తర్వాత ప్రభాకర్ రావును ఎస్‌ఐబీలో ఓఎస్‌డీగా (OSD) నియమించడం వెనుక ఉన్న కారణాలను, ఆ ప్రక్రియలో ఐఏఎస్ అధికారుల పాత్రను అధికారులు లోతుగా ఆరా తీశారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు సినీ ప్రముఖుల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలతో, ఆయన సూచించిన నంబర్లను ఎలాంటి పరిశీలన లేకుండా హోం శాఖకు పంపడంపై మాజీ ఐపీఎస్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందును కూడా విచారించి, నాటి ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాల్లో ఇంటెలిజెన్స్ విభాగం సమన్వయంపై స్పష్టత కోరారు.

గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేసిన ఈ అధికారులందరినీ సాక్షులుగా పరిగణిస్తూ, వారి వాంగ్మూలాల ఆధారంగా కేసులో మరిన్ని లోతైన విషయాలను వెలికితీసేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ప్రభాకర్ రావు ఇచ్చిన నంబర్ల జాబితాను ఉన్నతాధికారులు యథావిధిగా ముందుకు పంపడం వెనుక ఉన్న ఒత్తిళ్లు లేదా ఉద్దేశపూర్వక సహకారంపై సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ విచారణ ప్రక్రియ ముగిసిన అనంతరం సేకరించిన స్టేట్‌మెంట్లను అనుబంధ ఛార్జ్‌షీట్‌లో చేర్చడం ద్వారా ఈ కేసును మరింత పటిష్టం చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget