అన్వేషించండి

6 అడుగుల ఆజానుబాహులకు బెస్ట్‌ ఆప్షన్లు - కంఫర్ట్‌తో పాటు రైడింగ్‌ ఫన్‌ ఇచ్చే మోటార్‌సైకిళ్లు!

హైదరాబాద్‌ లేదా విజయవాడ వంటి తెలుగు నగరాల్లో రోజూ ఆఫీస్‌ ప్రయాణం, వీకెండ్స్‌లో సరదాగా రౌండ్స్‌ వేయడానికి 6 అడుగుల ఎత్తున్న రైడర్లకు సరిపోయే బెస్ట్‌ బైక్‌లు ఏవో తెలుసుకోండి.

Best Motorcycle For Tall Riders: కొందరి ఎత్తు 6 అడుగులకి పైగా ఉండి, వయసు 30+ అయితే, బాడీ స్ట్రక్చర్‌ కూడా బలంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఆఫీస్‌ లేదా ఇతర పనుల కోసం రోజూ హైదరాబాద్‌/ విజయవాడ వంటి ట్రాఫిక్‌ నగరాల్లో సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ, వీకెండ్స్‌లో సరదా రైడ్‌ ఇచ్చే బైక్‌ కోసం చూస్తుంటే... మోటార్‌ సైకిల్‌ ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి అవసరాలకు సరైన బైక్‌ ఎంపిక చేయడం అంత సులువు కాదు. కంటికి నచ్చిన బైక్‌ కొనేస్తే రైడింగ్‌ సమయంలో వెన్నెముక, భుజాల నొప్పులు వస్తాయి. 

ఆరు అడుగుల ఆజానుబాహులకు కావాల్సింది ట్రాక్‌ మీద దూసుకెళ్లే అగ్రెసివ్‌ మెషిన్‌ కాదు. అలాగే చిన్నగా కనిపించే బైక్‌ కూడా కాదు. స్ట్రాంగ్‌ రోడ్‌ ప్రెజెన్స్‌, ప్లష్‌ సస్పెన్షన్‌, కంఫర్ట్‌ రైడింగ్‌ పొజిషన్‌ – ఇవన్నీ ఉండాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల పరిస్థితి చూస్తే, బాడ్‌ రోడ్స్‌ను ఈజీగా హ్యాండిల్‌ చేసే బైక్‌ తప్పనిసరి.

అడ్వెంచర్‌ బైక్‌లు (ADV సెగ్మెంట్‌)

ADV సెగ్మెంట్‌ మీ అవసరాలకు బాగా సరిపోతుంది. పొడవైన సీట్‌ హైట్‌, స్ట్రైట్‌ రైడింగ్‌ పొజిషన్‌, లాంగ్‌ ట్రావెల్‌ సస్పెన్షన్‌ వల్ల బ్యాడ్‌ రోడ్లపై కూడా శరీరానికి అలసట తక్కువగా ఉంటుంది.

TVS Apache RTX 300
టీవీఎస్‌ నుంచి వచ్చిన ఈ కొత్త అడ్వెంచర్‌ బైక్‌ రోజువారీ సిటీ రైడింగ్‌కు కూడా సూట్‌ అవుతుంది. సస్పెన్షన్‌ సెటప్‌ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. రోడ్‌ ప్రెజెన్స్‌ కూడా బాగుంటుంది.

Royal Enfield Himalayan 450
పొడవైన రైడర్లకు ఇది దాదాపు పర్ఫెక్ట్‌ అని చెప్పొచ్చు. సీట్‌ పొజిషన్‌, హ్యాండిల్‌బార్‌ ప్లేస్‌మెంట్‌, సస్పెన్షన్‌ వంటివన్నీ లాంగ్‌ రైడ్స్‌కే కాదు, సిటీ కమ్యూట్‌కూ సౌకర్యంగా ఉంటాయి.

KTM 250 Adventure / 390 Adventure
పవర్‌ ఎక్కువగా కావాలంటే KTM 390, కొంచెం బ్యాలెన్స్‌ కావాలంటే KTM 250. ఈ రెండూ కూడా గుంతల రోడ్లను ఆత్మవిశ్వాసంతో హ్యాండిల్‌ చేస్తాయి.

నియో-రెట్రో బైక్‌లు

స్టైల్‌ కూడా ముఖ్యం అనుకుంటే, ఈ సెగ్మెంట్‌ను చూడొచ్చు.

Royal Enfield Classic 350 / Bullet 350
భారీగా కనిపించే డిజైన్‌, సౌకర్యమైన రైడింగ్‌ పొజిషన్‌ వీటికి పెద్ద ప్లస్‌. రోజూ ఆఫీస్‌కు, వీకెండ్‌ రైడ్స్‌కు బాగా సెట్‌ అవుతాయి.

Honda CB350 సిరీస్‌
ఇంజిన్‌ స్మూత్‌గా ఉంటుంది. కంఫర్ట్‌ విషయంలో కూడా మంచి పేరు ఉంది. పొడవైన రైడర్లకు సీట్‌ ఎర్గోనామిక్స్‌ సరిపోతాయి.

Royal Enfield Interceptor 650
కొంచెం పెద్ద బైక్‌ కావాలంటే ఇది మంచి ఎంపిక. అయితే బాడ్‌ రోడ్లపై సస్పెన్షన్‌ పరంగా అడ్వెంచర్‌ బైక్‌లా ఫీల్‌ ఇవ్వదు.

స్పోర్టీ నేకడ్‌ బైక్‌లు

అడ్వెంచర్‌ లుక్‌ లేకపోయినా పవర్‌, ప్రెజెన్స్‌ కావాలంటే ఇవి చూడొచ్చు.

Royal Enfield Guerrilla 450
నేకడ్‌ స్టైల్‌లో ఉన్నా, రైడింగ్‌ పొజిషన్‌ కంఫర్ట్‌గా ఉంటుంది. సిటీ, హైవే రెండింటికీ సరిపోతుంది.

Husqvarna Svartpilen 401
డిజైన్‌ యూనిక్‌గా ఉంటుంది. రైడింగ్‌ అనుభవం సరదాగా ఉంటుంది. అయితే రోడ్ల పరిస్థితి ఎక్కువగా చెడుగా ఉంటే సస్పెన్షన్‌ విషయంలో ఒకసారి ఆలోచించాలి.

చివరి మాట

మొదట చెప్పుకున్న అవసరాలను బట్టి, ఆరు అడుగులకు పైగా ఎత్తున్న రైడర్లకు అడ్వెంచర్‌ బైక్‌ సెగ్మెంట్‌ బెస్ట్‌ సూట్‌ అవుతుంది. అయితే, పేపర్‌పై చదివిన దాని కంటే టెస్ట్‌ రైడ్‌ చాలా ముఖ్యం. మీరు షార్ట్‌లిస్ట్‌ చేసిన ప్రతి బైక్‌ను సిటీ ట్రాఫిక్‌లో, బ్యాడ్‌ రోడ్లపై నడిపి చూసిన తర్వాతే ఫైనల్‌ నిర్ణయం తీసుకుంటే, తర్వాత ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Embed widget