అన్వేషించండి

Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్

Girl Molestation | చాక్లెట్ ఇప్పిస్తానని ఆశ చూపి తీసుకెళ్లిన ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. హైదరాబాద్ లోని నార్సింగిలో ఈ దారుణం జరిగింది.

POCSO Act | నార్సింగి: హైదరాబాద్‌ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఒక ఆరేళ్ల అభం శుభం తెలియని బాలికపై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడి, ఆపై చిన్నారిని హత్య చేశాడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి ఆ చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. తన గురించి చెబుతుందని పాపను హత్య చేశాడు. ఆదివారం సాయంత్రం నుండి బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాత్రి 10 గంటల సమయంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించగా, ఒక వ్యక్తి బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ ఆధారాలతో పోలీసులు నిందితుడిని వేగంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించి, అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బాలిక మృతదేహం ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి చూపించాడు.

పోలీసులు నిందితుడిపై అత్యాచారం, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్ ఆశ చూపించి తీసుకెళ్లి హత్యాచారం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను సమాజంలో బతకనివ్వొద్దని, ఉరితీసి చంపాలని డిమాండ్లు వస్తున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget