అన్వేషించండి

Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన

Man Kills Wife in Hayathnagar | భార్యతో జరిగిన గొడవలో ఆమెను హత్య చేసిన భర్త ఇంటికి దూరంలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆమెను కాపాడుతున్న నటించాడు. చివరికి హత్య చేసినట్లు అంగీకరించాడు.

హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల గ్రామంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివాహితను ఆమె భర్త హత్య చేసి, తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి సినిమా కథను తలపించేలా స్టోరీ చెప్పాడు. చివరికి కూతుళ్లు వచ్చి ప్రశ్నించడంతో తప్పు చేశానని అంగీకరించాడు. నిందితుడు ఆంజనేయులు తన భార్య ఉమారాణిని హత్య చేసి, బాత్రూం పైన ఉన్న పెయింట్ డబ్బా ఆమె మీద పడిపోవడంతో ప్రమాదవశాత్తు మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు.

నేరం బయటపడకుండా ఉండేందుకు ఆంజనేయులు తెలివిగా వ్యవహరించి, ఉమారాణిని సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లకుండా కావాలనే చాలా దూరంగా ఉన్న ఒక హాస్పిటల్‌కు తరలించాడు. అయితే, ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఉమారాణి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో భయపడిన నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, బాత్రూంలో పెయింట్ డబ్బా మీద పడటం వల్లే ఆమె చనిపోయిందని కట్టుకథలు చెప్పి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు.

అయితే, తండ్రి మాటలపై అనుమానం వచ్చిన కూతుళ్లు పదే పదే ప్రశ్నించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో తరచుగా చిన్నపాటి గొడవలు జరుగుతుండటం, తండ్రి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో తన తప్పును ఒప్పుకున్న ఆంజనేయులు, గొడవ ముదిరి తానే భార్యను చంపినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Trainee IPS Suicide Attempt: లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget