అన్వేషించండి

New Renault Duster: మార్చి 17న రెనాల్ట్ డస్టర్ లాంచింగ్‌.. కారు తయారీలో ఐఐటీ కాన్పూర్ కీలకపాత్ర.. ఫీచర్ల వివరాలు

New Renault Duster Launch: ఫ్రెంచ్ కంపెనీ రెనాల్డ్ డస్టర్ భారత్‌లో కొత్త రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీని మార్చి 17న లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఏళ్ల వారంటీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్ (Renault) తన పాపులర్ SUV Dusterను భారత్‌లో మళ్లీ లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కొన్ని ఏళ్ల క్రితం ఈ కారును భారత మార్కెట్లో నిలిపివేసిన  కంపెనీ ఇప్పుడు సరికొత్త లుక్, ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొస్తుంది. భారత మార్కెట్‌లో కొత్త రెనాల్ట్ డస్టర్ (Renault Duster) మార్చి 17న లాంచ్ కానుంది. కంపెనీ కొత్త డస్టర్‌తో పాటు 7 ఏళ్ల వారంటీని అందించనుండటం విశేషం. ఈ కారు బుకింగ్స్ కేవలం రూ. 21,000 తో ప్రారంభమయ్యాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, టర్బో పెట్రోల్ మోడల్ డెలివరీలు ఏప్రిల్ నాటికి ప్రారంభం కావచ్చు, కాగా స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ డెలివరీలు అయితే ఈ ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి రానున్నాయి. 

కారు డిజైన్ ఎలా ఉంటుంది ?

కొత్త రెనాల్ట్ డస్టర్ డిజైన్ విషయానికి వస్తే, కొత్త డస్టర్ లుక్ మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. ఇందులో కొత్త డిజైన్ హెడ్‌ల్యాంప్‌లు, వెనుక కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. ముందుండే బోనెట్ దీనికి పవర్‌ఫుల్ లుక్‌ని ఇస్తుంది. ముందు భాగంలో పెద్ద బంపర్, గ్రిల్‌పై రెనాల్ట్ లోగో ఇచ్చారు. అలాగే వెడల్పాటి వీల్ ఆర్చ్‌లు, రూఫ్ రెయిల్స్, వెనుక భాగంలో పలు రంగుల బంపర్ ఇన్సర్ట్‌లు డస్టర్ ఎస్‌యూవీని మరింత స్టైలిష్‌గా మారుస్తాయి.

ఇంటీరియర్, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

న్యూ రెనాల్ట్ డస్టర్ లోపలి భాగంలో కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గూగుల్ సపోర్ట్‌తో కూడిన 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. వీటితోపాటు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. 

డ్రైవర్ సీటును వివిధ రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందు సీట్లలో కూలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. భద్రత కోసం 360 డిగ్రీ కెమెరా, 17 ఫీచర్లు కలిగిన ADAS ప్యాకేజీని అందించారు. కంపెనీ ప్రకారం, దీని బూట్ స్పేస్ రూఫ్ వరకు కొలిచినప్పుడు సుమారు 700 లీటర్లు ఉంది. ఇది లాంగ్ జర్నీలకు మంచి వాహనంగా భావించవచ్చు. 

ఈ SUV గతంలో కూడా మిడ్ సైజ్ సెగ్మెంట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. కంపెనీ తన కొత్త ప్లాన్‌పై పని చేస్తున్న కారణంగా డిసెంబర్ 2022లో దీనిని నిలిపివేశారు. ఇప్పుడు కంపెనీ నేరుగా కొత్త గ్లోబల్ మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తోంది.

రెనాల్ట్ డస్టర్‌లో ఐఐటీ కాన్పూర్ కీలకపాత్ర
కొత్త Renault Dusterను డిజైన్, డెవలప్ చేయడంలో IIT కాన్పూర్ కీలక పాత్ర పోషించింది.  కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త డస్టర్‌ను రూపొందించడానికి Renault బృందం IIT కాన్పూర్‌తో కలిసి పనిచేసింది. మోడ్రన్ నేషనల్ విండ్ టన్నెల్ ఫెసిలిటీ (NWTF)ని ఉపయోగించి కారు ఏరోడైనమిక్స్‌ను పరీక్షించారు. ఈ టెస్ట్ ద్వారా గాలి కారుపై ఎలా ప్రభావం చూపుతుంది, కారు లోపలికి వచ్చే గాలి శబ్దాన్ని ఎలా తగ్గించవచ్చు అని పరిశీలించారు. లాంచ్ అయితే  ఈ కారు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్ (Kia Seltos), మారుతి సుజుకీ గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) వంటి వాహనాలకు గట్టి పోటీని ఇవ్వవచ్చు.

కొత్త మిడ్ సైజ్ SUV Dusterలో ఆర్టిక్యులేషన్ ఇండెక్స్ (AI) 73 శాతంగా ఉంది. ఇది ఈ సెగ్మెంట్లో చాలా మంచిదని Renault ఇండియా  తెలిపింది. కారులో కూర్చున్న వారికి బయటి శబ్దం, వైబ్రేషన్స్ చాలా తక్కువగా అనిపిస్తాయి. అంటే కారు క్యాబిన్లో కూర్చుని ప్రజలు హాయిగా మాట కంపెనీ కొత్త Renault Dusterను భారత్‌లో మార్చి 17న లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

గ్లోబల్ మోడల్ కంటే భిన్నంగా భారత Duster
కొత్త Renault Dusterను మోడ్రన్‌గా చేసేందుకు కంపెనీ అనేక కంప్యూటర్ బేస్డ్ ఇంజనీరింగ్ టూల్స్‌ను ఉపయోగించింది. దాంతో కారు డ్రాగ్ కోఎఫీషియంట్ దాదాపు 13 శాతం తగ్గింది.  అంటే కారుపై గాలి ఒత్తిడి తగ్గుతుంది. భారత్‌లో తయారయ్యే కొత్త Duster గ్లోబల్ మోడల్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది దాదాపు 50 మిమీ ఎక్కువ ఎత్తులో, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు. వీటితో భారత కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget