అన్వేషించండి

Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Vizag: విశాఖ నగరానికి సెమీరింగ్ రోడ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం నుంచి రాంబిల్లి వరకూ దీన్ని ప్లాన్ చేస్తున్నారు.

Visakhapatnam Semi Ring Road: విశాఖపట్నం నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మెట్రోపాలిటన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్ మోడల్‌ను స్ఫూర్తిగా తీసుకుని, విశాఖలో  భోగాపురం నుండి రాంబిల్లి వరకు  సుమారు 85 కిలోమీటర్ల మేర  సెమీ రింగ్ రోడ్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇప్పటికే రూ.4.84 కోట్లు మంజూరు చేసింది. 

విశాఖ రూపు రేఖలు మార్చే సెమీ రింగ్ రోడ్ ప్రాజెక్ట్                      

నగర రవాణా ముఖ చిత్రాన్ని మార్చే కీలకమైన విశాఖ మెట్రో రైల్  ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించి  రైట్స్  సంస్థ నిర్వహిస్తున్న సమగ్ర అధ్యయనం మరో రెండు నెలల్లో పూర్తి కానుంది. ఈ నివేదిక అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో పనులను వేగవంతం చేసి, మూడేళ్ల కాలపరిమితిలో మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుండి స్టీల్ ప్లాంట్ వరకు దాదాపు 77 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో మెట్రో రైలు పరుగులు తీయనుంది.  

సిక్స్ లేన్ బీచ్ కారిడార్ పనులు కూడా వేగం                                

మరోవైపు, విశాఖ తీర ప్రాంతాన్ని పర్యాటక , ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు  సిక్స్-లేన్ బీచ్ కారిడార్  పనులు ఊపందుకుంటున్నాయి. దాదాపు రూ.6,300 కోట్ల వ్యయంతో కైలాసగిరి నుండి భోగాపురం విమానాశ్రయం వరకు 55-60 కిలోమీటర్ల మేర ఈ తీరప్రాంత రహదారి నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే నగరం నుండి ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణ సమయం 40-45 నిమిషాలకు తగ్గుతుంది. అంతేకాకుండా, భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న 7 మాస్టర్ ప్లాన్ రోడ్లను మే 2026 నాటికి పూర్తి చేయాలని అధికారులు గడువు విధించుకున్నారు.                        

మరిన్నిపెట్టుబడులు ఆకర్షించేలా మౌలిక సదుపాయాల కల్పన                 

మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ సమీక్షలో  పట్టణ స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంచుతూ, భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా విశాఖ నగరం కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ఐటీ మరియు పారిశ్రామిక రంగాల్లో ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా ఎదుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.                                         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Simhachalam Chandanotsavam 2026: వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజ రూపం ఎలా ఉంటుందో తెలుసా..చందనోత్సవం ఎందుకు చేస్తారు!
వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజ రూపం ఎలా ఉంటుందో తెలుసా..చందనోత్సవం ఎందుకు చేస్తారు!
Simhachalam Chandanotsavam 2026 : సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం! నిజరూప దర్శన సమయం, టికెట్ల వివరాలు ఇవిగో!
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం! నిజరూప దర్శన సమయం, టికెట్ల వివరాలు ఇవిగో!
Pawan vs Prakash Raj: డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
డీలిమిటేషన్ బిల్లుపై ఢీ అంటే ఢీ! పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్‌ మధ్య సోషల్ మీడియా వార్!
Vizag Crime News:సోషల్ మీడియా స్నేహమే ప్రాణం తీసింది! విశాఖ విద్యార్థి శాంతి కుమారి మృతి కేసులో మలుపు!  
సోషల్ మీడియా స్నేహమే ప్రాణం తీసింది! విశాఖ విద్యార్థి శాంతి కుమారి మృతి కేసులో మలుపు!  
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Japan Tsunami Alerts: జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
Chandrababu Birthday Celebrations: అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
Indravelli Martyrs Memorial: ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం
ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం.. ఆరోజు ఏం జరిగింది?
Hyderabad Crime News: ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
Atlee : మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
Delimitation: పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
Cervical Pain : సర్వైకల్ నొప్పి ఉన్నప్పుడు శరీరం ఇచ్చే స్ట్రాంగ్ సంకేతాలు ఇవే.. విస్మరించకండి
సర్వైకల్ నొప్పి ఉన్నప్పుడు శరీరం ఇచ్చే స్ట్రాంగ్ సంకేతాలు ఇవే.. విస్మరించకండి
US Iran Peace Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
Embed widget