Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Oscar Awards 2026 : ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో దాదాపు 14 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఓ కేటగిరీలో టై అయ్యింది. ఒకే అవార్డును ఇద్దరు విజేతలకు అందించారు.

Oscar Awards 2026 Tie For Best Live Action Short Film Category : అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లోని ఆస్కార్ అవార్డ్స్ 2026 వేడుకల్లో అరుదైన ఘటన జరిగింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఒకే కేటగిరీలో రెండు సినిమాలకు అవార్డు వరించింది. ప్రజెంటర్ కుమాయిల్ నంజియాని అవార్డు అనౌన్స్ చేసేందుకు స్టేజ్‌పైకి పిలిచారు. ఆయన ఎన్వలప్ ఓపెన్ చేసి ఏమీ మాట్లాడలేదు. దీంతో వేదిక మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆ విభాగం టై
ఆ తర్వాత కవర్ ఓపెన్ చేసి ఈ కేటగిరీగా టై అయ్యిందని... అవార్డును ఇద్దరు విజేతలు గెలుచుకున్నారని అనౌన్స్ చేశారు. దీంతో డాల్బీ థియేటర్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. 98 ఏళ్ల ఆస్కార్ చరిత్ర ఇలా జరగడం ఇది ఏడోసారి. 14 ఏళ్ల తర్వాత టై కావడం ఇదే ఫస్ట్ టైం. 'బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం' కేటగిరీలో 'ది సింగర్స్', 'టు పీపుల్ ఎక్స్చేంజ్ సలైవా' మూవీస్‌ను ఆస్కార్ వరించింది.
'షార్ట్ ఫిలిం అవార్డు ఇవ్వడానికి రెట్టింపు టైం పడుతుంది.' అంటూ నంజినియా నవ్వులు పూయించారు. ఇదే టైంలో హోస్ట్ కోనన్ ఓబ్రియన్ రియాక్ట్ అవుతూ... 'ఈ టై వల్ల వరల్డ్ వైడ్‌గా 22 మిలియన్ల మంది ఆస్కార్ బెట్టింగ్ చేసిన వారి పరిస్థితి ఏంటో?' అంటూ చమత్కరించారు. దీంతో థియేటర్ మొత్తం నవ్వులు విరిశాయి. ఆ తర్వాత విజేతలకు అవార్డ్ అందించారు.
Also Read : ఆస్కార్ అవార్డుల సంబరం - బెస్ట్ మూవీ ఏంటో తెలుసా?... ఈసారి వెరీ స్పెషల్
ఇప్పటివరకూ టై ఎప్పుడంటే?
ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో ఒకే కేటగిరీలో ఇద్దరికి అవార్డులు ఇది ఏడోసారి. లాస్ట్‌గా 2012లో ఓ విభాగానికి టై అయ్యింది. ఆ లిస్ట్ ఓసారి చూస్తే...
- 1932 - ఉత్తమ నటుడు కేటగిరీ (వాలెస్ బీరీ, ఫ్రెడ్రిక్ మార్చ్)
- 1949 - బెస్ట్ డాక్యుమెంటరీ (ఏ ఛాన్స్ టు లివ్, సో మచ్ ఫర్ సో లిటిల్)
- 1968 - ఉత్తమ నటి (కేథరిన్ హెప్బర్న్, బార్బరా స్ట్రీసాండ్)
- 1986 - బెస్ట్ ఫీచర్ డాక్యుమెంటరీ (ఆర్టీ షా : టైమ్ ఈజ్ ఆల్ యూ హావ్ గాట్, డౌన్ అండ్ అవుట్ ఇన్ అమెరికా)
- 1994 - బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ (ఫ్రాంక్ కాఫ్కాస్ ఇట్స్ ఏ వండర్ ఫుల్ లైఫ్, ట్రెవర్)
- 2012 - ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ (స్కైఫాల్, జీరో డార్క్ థర్టీ)
- 2026 - బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం (ది సింగర్స్, టు పీపుల్ ఎక్స్చేంజ్ సలైవా)
ట్రెండింగ్ వార్తలు



















