అన్వేషించండి

ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం

Investment Tips | భారత్‌లో పెట్టుబడిదారులు అధిక రాబడితో పాటు సురక్షితమైన పెట్టుబడి మార్గాలను కోరుకుంటారు. వారికి PPF ఒక మంచి ఎంపికగా చెప్పవచ్చు.

PPF Investment | భారత పెట్టుబడిదారులు మెరుగైన రాబడితో పాటు, తమ డబ్బు సురక్షితంగా ఉండే, క్రమంగా బలమైన నిధిగా మారే పెట్టుబడి అవకాశ మార్గాలను వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి నెలా కొద్దికొద్దిగా డబ్బు ఆదా చేసి, భవిష్యత్తు కోసం పెద్ద మొత్తాన్ని కూడబెట్టాలని అనుకుంటారు.

వారికి సురక్షితమైన పథకం చాలా అవసరం. మీరు కూడా అలాంటి పథకంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మీకు ఒక ఎంపిక కావచ్చు. ప్రభుత్వ పథకం భద్రతతో పాటు రాబడి రెండింటినీ అందిస్తుంది. ఇక్కడ పెట్టుబడిదారులు చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తాన్ని కూడబెడతారు. దీని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. 

పీపీఎఫ్ లో పెట్టుబడి రూల్స్.. మెచ్యూరిటీ సమాచారం

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక ప్రభుత్వ పథకం. పీపీఎఫ్ మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. ఈ సమయంలో, పెట్టుబడిదారు ప్రతి సంవత్సరం ఖాతాలో కనీస నిర్ణీత మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. పీపీఎఫ్ లో వార్షిక కనిష్ట పెట్టుబడి రూ. 500 నుండి ప్రారంభమవుతుంది. మీరు ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారులకు ఈ పథకంపై 7.1 శాతం వార్షిక వడ్డీ సైతం లభిస్తుంది. 

15 సంవత్సరాల మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత, పెట్టుబడిదారులు కోరుకుంటే పీపీఎఫ్ పథకాన్ని 5 సంవత్సరాల చొప్పున మరో రెండు సార్లు పొడిగించుకోవచ్చు. అంటే ఈ పీపీఎఫ్ పథకంలో పెట్టుబడిదారులు 25 సంవత్సరాల వరకు పెట్టుబడి కొనసాగించవచ్చు. మెచ్యూరిటీ తర్వాత విత్‌డ్రా చేసుకోకపోతే వడ్డీ వస్తూనే ఉంటుంది. 

 4000 పెట్టుబడితో 13 లక్షల కార్పస్ ను తయారు చేసుకోండి

పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పెద్ద మొత్తాన్ని పొందవచ్చు. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు పీపీఎఫ్ పథకంలో ప్రతి నెలా రూ. 4,000 జమ చేయడం ప్రారంభించినట్లయితే, సంవత్సరానికి మీ పెట్టుబడి రూ. 48,000 అవుతుంది.

ఈ విధంగా 15 సంవత్సరాల పాటు పెట్టుబడి కొనసాగిస్తే, మొత్తం పెట్టుబడి మొత్తం రూ. 7.20 లక్షలు అవుతుంది. పీపీఎఫ్ లో లభిస్తున్న వడ్డీ రేటు ప్రకారం, మెచ్యూరిటీ వద్ద మీకు సుమారు 13.01 లక్షల రూపాయలు లభిస్తాయి. అంటే ఇందులో దాదాపు 5.81 లక్షల రూపాయల లాభం ఉంటుంది. మీ చిన్న పెట్టుబడి అవసరం పడే సమయంలో పెద్ద మొత్తంగా మారవచ్చు. 

Also Read: Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget