ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ EDLI నియమాలను సులభతరం చేసింది. ఉద్యోగం మారేటప్పుడు చిన్న విరామం వల్ల రిజెక్ట్ అయ్యే డెత్ క్లెయిమ్‌ల వల్ల ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.

EPFO EDLI Rules Change: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) నిబంధనలను సులభతరం చేయడానికి చర్యలు చేపట్టింది. ఉద్యోగం మారే సమయంలో చిన్న విరామం కారణంగా డెత్ క్లెయిమ్ తిరస్కరణకు గురైన ఉద్యోగుల కుటుంబాలకు తాజా నిర్ణయం నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది.
డిసెంబర్ 2025లో EPFO జారీ చేసిన సర్క్యులర్ ద్వారా EDLI సమస్యను తగ్గించడానికి ప్రయత్నించింది. ఇది ఉద్యోగుల ప్రయోజనాల కోసం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మారనుంది. EPFO తీసుకున్న ముఖ్యమైన మార్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
వారాంతం కారణంగా సర్వీస్ బ్రేక్ ఉండదు
గత నిబంధనలలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే, ఒక ఉద్యోగి శుక్రవారం పాత ఉద్యోగాన్ని వదిలి సోమవారం కొత్త కంపెనీలో చేరితే మధ్యలో శనివారం, ఆదివారాలను సర్వీస్‌లో బ్రేక్‌గా పరిగణించేవారు. ఈ సాంకేతిక సర్వీస్ బ్రేక్ వల్ల ఉద్యోగుల కుటుంబాలు కొంతమేర నష్టపోవాల్సి వచ్చేది.
EDLI వంటి సౌకర్యాల కోసం నిరంతర సర్వీస్ తప్పనిసరి షరతుగా ఉండేది. అయితే, EPFO ఇప్పుడు కొత్త నిబంధనలలో ఈ గందరగోళాన్ని ఉద్యోగుల కుటుంబాల్లో తొలగించింది. ఉద్యోగం మారే సమయంలో మధ్యలో వీకెండ్స్ సెలవులు వస్తే, వాటిని సర్వీస్ బ్రేక్‌గా పరిగణించబోమని EPFO స్పష్టం చేసింది.
వారాంతపు సెలవులతో పాటు, జాతీయ సెలవులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు కూడా ఇందులో చేర్చారు. దీని అర్థం, ఉద్యోగి సేవలు నిరంతరాయంగా ఉన్నాయని పరిగణించనున్నారు. అలాగే, కుటుంబం బీమా లేదా పెన్షన్ వంటి ప్రయోజనాలకు దూరం కాదు.
కనీసం రూ.50 వేల హామీ
EPFO జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, EDLI స్కీమ్ కింద లభించే కనీస చెల్లింపును 50 వేల రూపాయలకు పెంచాలని కూడా నిర్ణయించారు. సగటు PF బ్యాలెన్స్ 50 వేల రూపాయల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు కూడా, వారి కుటుంబాలకు బీమాగా కనీసం 50,000 రూపాయలు చెల్లించబడతాయి.
Also Read: EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు!






















