search
×

Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్

Sukanya Samriddhi Yojana | పిల్లల ఉన్నత చదువు కోసం పెట్టుబడికి ఇప్పటినుంచే ప్లాన్ చేయాలి. అందుకు కొన్ని మార్గాలున్నాయి. మీకు తక్కువ రిస్క్ ఉన్న చోట ఇన్వెస్ట్ చేయడం బెటర్.

FOLLOW US: 
Share:

Investment for childrens education: పిల్లల చదువుల ఖర్చు ప్రతి ఏడాది పెరుగుతోంది. దీని కారణంగా తల్లిదండ్రులు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. మెడిసిన్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ లేదా విదేశాలలో చదువు వంటి స్ట్రీమ్‌ల ఫీజులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కేవలం పొదుపుతో సరిపోదు. కనుక సరైన పెట్టుబడితోనే వారికి మంచి చదువు చెప్పించడం సాధ్యం. పిల్లలు చిన్నవారైతే, చిన్న మొత్తంతో ప్రారంభించి, తరువాత పెద్ద ఫండ్ అయ్యేలా చూడాలి. డబ్బును ఏ ఆప్షన్‌లో పెట్టాలి అనేది మీరు తెలివిగా నిర్ణయించుకోవాలి. కొన్ని ప్లాన్‌లు సురక్షితమైనవి, కొన్ని మంచి రాబడిని ఇస్తాయి. మరికొన్ని ప్రత్యేకంగా బాలికల చదువు కోసం రూపొందించారు. మీ అవసరాలకు అనుగుణంగా ఏది బెస్ట్ ఇక్కడ తెలుసుకుందాం. 

 స్థిరమైన రాబడినిచ్చే ఆప్షన్ PPF

PPF చాలా కాలం నుంచి నమ్మదగిన పెట్టుబడిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇక్కడ మీ కష్టార్జితం సురక్షితంగా ఉంటుంది. వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది రిస్క్ లేని మార్గాన్ని ఇష్టపడే తల్లిదండ్రులకు సరైన ఎంపిక.  15 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ కాబట్టి పిల్లల చదువు వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇది మంచి ఎంపిక. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ వరకు మీకు అధిక మొత్తం వస్తుంది. 

ప్రస్తుతం పీపీఎఫ్ ద్వారా 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. సంవత్సరానికి కనీసం రూ.500 తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి 1.5 లక్షల రూపాయలు. మెచ్యూరిటీ తర్వాత కూడా ఖాతాను 5- 5 సంవత్సరాల కాలానికిగానూ పొడిగించవచ్చు. మీకు ట్యాక్స్ బెనిపిట్ కూడా లభిస్తుంది.

మ్యూచువల్ ఫండ్ స్మార్ట్ గ్రోత్ ప్లాన్

మీరు పిల్లల చదువు కోసం పెద్ద ఫండ్ ఏర్పాటు చేయాలనుకుంటే, మ్యూచువల్ ఫండ్ SIP ఒక తెలివైన ఎంపిక అవుతుంది. రాబడి అనేది మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. కనుక కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ఈ రిస్క్‌ను చాలా వరకు బ్యాలెన్స్ చేస్తుంది. 10 నుండి 15 సంవత్సరాలలో SIP వేగంగా వృద్ధి చెందుతుంది. మీ అధిక ఖర్చులను సులభతరం చేస్తుంది.

చిన్న పెట్టుబడితో ప్రారంభించి, ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని పెంచే సౌకర్యం దీనిని మరింత మెరుగు చేస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోగల, దీర్ఘకాలిక దృష్టి ఉన్న తల్లిదండ్రులకు ఇది మంచి ఛాయిస్.  మార్కెట్ పైకి క్రిందికి అవుతుంది. కానీ వృద్ధి అవకాశాలు కూడా అంతే ఉంటాయి. కనుక సుదీర్ఘకాలంలో సిప్ చేయడం ద్వారా ఇది పిల్లల చదువు కోసం ఫండ్స్ తయారు చేయడానికి మంచి మార్గం.

సుకన్య సమృద్ధి యోజన బాలికలకు బెస్ట్

మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే సుకన్య సమృద్ధి యోజన అత్యంత లాభదాయకమైన పథకాల్లో ఒకటి. ఇది సురక్షితమైన పెట్టుబడి. ప్రస్తుతం 8.2 శాతం అధిక వడ్డీని అందిస్తుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలిక పేరు మీద ఖాతా తెరవొచ్చు. పెట్టుబడి కాలం 15 సంవత్సరాలు, ఖాతా 21 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. సంవత్సరానికి కనీసం రూ.250 , గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు జమ చేయవచ్చు. వచ్చే రాబడి బాలికల ఉన్నత విద్యలో మీకు హెల్ప్ అవుతుంది. పన్ను ప్రయోజనం (Tax Benefit) కూడా లభిస్తుంది. రిస్క్ ఏమీ ఉండదు. కనుక బాలికల కోసం ఫ్యూచర్ ఫండ్ తయారు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఈ ప్లాన్ సరైనదగా చెప్పవచ్చు. 

Published at : 12 Dec 2025 12:16 PM (IST) Tags: Mutual Funds PPF Sukanya Samriddhi Yojana SSY Girls Investment Tips #telugu news Sukanya Scheme

ఇవి కూడా చూడండి

World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్‌ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!

World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్‌ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!

Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి

Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది

టాప్ స్టోరీస్

Telangana Govt Employees: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 

Telangana Govt Employees: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 

Pawan Kalyan:"పిఠాపురంలో రూల్‌బుక్, అభివృద్ధే మాట్లాడాలి" అధికారులకు కీలక ఆదేశాలు! మార్చి 14న భారీ బహిరంగ సభ

Pawan Kalyan:

Hyderabad Crime News: పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి

Hyderabad Crime News: పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి

Nache Nache Song : 'ది రాజా సాబ్'లో నాచే నాచే సాంగ్ - కాపీ కొట్టారని చెప్పు చూపించిన కంపోజర్

Nache Nache Song : 'ది రాజా సాబ్'లో నాచే నాచే సాంగ్ - కాపీ కొట్టారని చెప్పు చూపించిన కంపోజర్