అన్వేషించండి

Adobe CEO Shantanu Narayen : అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?

Shantanu Narayen resignation: విజయవంతమైన సీఈఓలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ తన పదవికి రాజీనామా చేశారు. ఏఐ టూల్స్ తో పోటీని తట్టుకోలేకపోవడమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Is Shantanu Narayen resignation AI Effect: టెక్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన సీఈఓలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అడోబ్ (Adobe)  సీఈవో శాంతను నారాయణ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు అడోబీని క్లౌడ్ కంప్యూటింగ్ , సబ్‌స్క్రిప్షన్ మోడల్ వైపు విజయవంతంగా నడిపించిన ఆయన నిష్క్రమణ, టెక్ పరిశ్రమలో ఒక శకం ముగింపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక ప్రస్తుతం ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సవాళ్లు ఉన్నాయని ప్రధానంగా వినిపిస్తోంది.  నిజానికి ఆయన ఆ సంస్థలో సీఈవోగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంపై రెండు రోజులకిందటే అందరూ అభినందులు తెలిపారు. అంతలోనే రాజీనామా చేశారు. 

అడోబ్ సంస్థ గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోషాప్ వంటి రంగాల్లో ఏకఛత్రాధిపత్యం వహించినప్పటికీ, జనరేటివ్ AI  రాకతో ఆధిపత్యం ఒక్కసారిగా దెబ్బతింది. ఓపెన్ ఏఐ  సూరా , మిడ్‌జర్నీ వంటి టూల్స్ సామాన్యులకు కూడా అద్భుతమైన విజువల్స్ సృష్టించే శక్తిని ఇవ్వడంతో అడోబీ సాఫ్ట్‌వేర్ల అవసరం తగ్గుతూ వస్తోంది. శాంతను నేతృత్వంలో అడోబ్ తన స్వంత AI  ఫైర్‌ఫ్లై ని ప్రవేశపెట్టినప్పటికీ, మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని. పెట్టుబడిదారుల ఒత్తిడిని తట్టుకోవడం సవాలుగా మారింది.                              

శాంతను నారాయణ్ రాజీనామా కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదని, అది AI సృష్టిస్తున్న విధ్వంసకర మార్పులకు  నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో, భారీ సంస్థలు తమ ఉనికిని కాపాడుకోవడానికి కొత్త నాయకత్వం,  వినూత్న ఆలోచనల వైపు మొగ్గు చూపుతున్నాయి. అడోబ్ షేర్ల విలువలో కనిపిస్తున్న ఒడిదుడుకులు , భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి కూడా ఆయన నిష్క్రమణకు ఒక కారణం కావచ్చని తెలుస్తోంది.                                      

భారత సంతతికి చెందిన శాంతను నారాయణ్ హయాంలో అడోబ్ విలువ వందల బిలియన్ డాలర్లకు చేరింది. అయితే, AI యుగంలో సాఫ్ట్‌వేర్ రంగం ఎదుర్కొంటున్న సంక్లిష్టతలను పరిష్కరించడం,  కొత్త పోటీదారులను ఎదుర్కోవడం రాబోయే నాయకత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. ఒక కంపెనీని శిఖర స్థాయికి చేర్చిన నాయకులు కూడా, AI వంటి విప్లవాత్మక మార్పులు వచ్చినప్పుడు ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొంటారో శాంతను రాజీనామా స్పష్టం చేస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget