అన్వేషించండి

Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం

Pawan Kalyan: మొంథా తుపాను సహాయ చర్యల్లో ఉదారంగా ఉండాలి.. సాయం విరివిగా ప్రజలకు అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. పిఠాపురం వరదసాయంపై ప్రత్యేకంగా సమీక్షించారు.

Pawan Kalyan reviews:  కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ప్రకటించిన సాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికీ  అందేలా చూడాలని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో పారిశుధ్యం, తాగు నీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఆదేశించారు.

శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఆర్ఓ, ఆర్డీవోలు, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, వ్యవసాయ, విద్యుత్ శాఖలతోపాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో జరిగిన నష్టం వివరాలపై ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుపాను అనంతరం తీసుకుంటున్న ఉపశమన చర్యలు, ఆస్తి, పంట నష్టం అంచనాలపై దిశా నిర్దేశం చేశారు.

కాకినాడ జిల్లా పరిధిలో మొత్తం 21 మండలాలు, ఏడు మున్సిపాలిటీలు ప్రభావితం అయినట్టు కలెక్టర్ షాన్ మోహన్  వివరించారు. మొత్తం 61 ఇళ్లు దెబ్బ తినగా, 41,932 కుటుంబాలపై మొంథా ప్రభావం చూపినట్టు తెలిపారు. అందులో 27,624 మత్స్యకార, 313 చేనేత కుటుంబాలు ఉన్నట్టు చెప్పారు. 21, 711 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, 668 ఎకరాల్లో అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. మొత్తం 33,596 మంది రైతులు తుపాను కారణంగా నష్టపోయినట్టు తెలిపారు.  విద్యుత్ పరికరాలు, రోడ్లు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టు వివరించారు. ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే  వరి, ఉద్యాన పంటలు కలిపి 2,500 మంది రైతులు వరకు పంటలు నష్టపోయినట్టు చెప్పారు. అంతటా ఉపసమన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. 

ముఖ్యంగా పంట నష్టం అంచనాలు రూపొందించే సమయంలో రైతుల పక్షాన నిలచి పక్కాగా నివేదికలు రూపొందించాలి. దీంతోపాటు ఆస్తి నష్టం వివరాలు కూడా రూపొందించాలని పవన్ సూచించారు.  దెబ్బ తిన్న ఇళ్లకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలి. తుపాను అనంతరం గ్రామాల్లో పల్లపు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. గ్రామాల వారీగా పారిశుధ్య కార్యక్రమాలు ఎంత వరకు వచ్చాయో ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించండి. ఎంత మేర రోడ్లు దెబ్బతిన్నాయో  గుర్తించి, పాక్షికంగా దెబ్బ తిన్న చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.   ఉప్పాడ తీర ప్రాంతంలోని సుబ్బంపేట వద్ద సముద్ర కోత నుంచి రక్షణకు రాళ్లతో తాత్కాలిక రక్షణ గోడ ఏర్పాటు చేశాం. ఇది సముద్రపు కోతను నిలువరించగలిగింది. మిగిలిన తీర ప్రాంత గ్రామాలకు కూడా ఈ రాళ్ల గోడ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటాం. శాశ్వత రక్షణ గోడ నిర్మాణం పూర్తయ్యే వరకు ఇది తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తుంది. తీర ప్రాంత గ్రామాల రక్షణకి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని ఆదేశించారు. 

 పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్షించారు.  తుపాను అనంతరం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగినట్టు సమాచారం వచ్చింది. పిఠాపురం పట్టణం పరిధిలోని కరివేపాకు పేట ప్రాంతం వద్ద పల్లపు ప్రాంతాల్లో వర్షం నీరు ఇంకా నిలిచి ఉన్నట్టు తెలిసింది. ఆ నీటిని తక్షణం బయటికి పంపే ప్రయత్నం చేయాలి.  ఏలేరు కాలువ గొర్రెకండె గట్టు వద్ద కొంత బలహీనంగా ఉన్నట్టు తెలిసింది. ముంపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన కాలువ గట్లు పటిష్టపరచాలన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget