Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
Aarey Shyamala : కర్నూలు బస్సుప్రమాదంపై తప్పుడు ప్రచారం చేశారని ఆరె శ్యామలపై కేసు నమోదు చేశారు. మరో 27 మందిపైనా ఈ కేసు పెట్టారు.

Case registered against Aarey Shyamala: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకురు గ్రామ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై అసత్య ప్రచారం చేస్తున్న 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ జాబితాలో వైసీపీ సీనియర్ నేత ఆరే శ్యామల, మాజీ ఎమ్మెల్యే సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణతో పాటు వైసీపీ పార్టీ అధికారిక ఎక్స్ (ట్విటర్) పేజీ నిర్వాహకులు కూడా ఉన్నారు. అక్టోబర్ 24న జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు దర్యాప్తులో మద్యం మత్తులో బైక్ నడిపిన యువకుడు కారణమని తేల్చగా, దీన్ని 'బెల్ట్ షాపులు, కల్తీ మద్యం' కారణంగా చిత్రీకరించి ప్రచారం చేశారు. అందుకే కేసులు నమోదు చేశారు.
పోలీసులు పరిశీలించిన సీసీటీవీ ఫుటేజ్‌లు, సాక్ష్యాలు ప్రకారం, ప్రమాదానికి మద్యం తాగి బైక్ నడిపిన శివశంకర్ (25) కారణమని తేలింది. శివశంకర్ మరో వైపు రోడ్డుపై పడిపోయి మరణించాడు. అతని స్నేహితుడు ఎర్రి స్వామి (22)ను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించారు. స్వామి వాంగ్మూలం ప్రకారం, తన స్వగ్రామానికి వెళ్తూండగా శివశంకర్ 'డోన్‌లో దింపుతాను' అని చెప్పి బైక్ ఎక్కమని అడిగాడు. ఇద్దరూ మద్యం తాగి బయలుదేరాడు. రోడ్డు డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. స్వామి అతని మృతదేహాన్ని పక్కకు తరలించి, బైక్‌ను రోడ్డు మధ్యలోనే వదిలేసాడు. అంతలో వచ్చిన కావేరీ బస్సు బైక్‌ను ఈడ్చుకుని ముందుకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. స్వామికి స్వల్ప గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.
పోలీసులు పెట్రోల్ బంక్‌లో శివశంకర్ బైక్‌కు పెట్రోల్ కొట్టించుకున్న సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. దీని ఆధారంగా మద్యపానం, అధిక వేగం కారణంగా ప్రమాదం జరిగినట్టు నిర్ధారణ అయింది.
ప్రమాదం జరిగిన తర్వాత వైసీపీ నేతలు, సోషల్ మీడియా ద్వారా 'బెల్ట్ షాపుల్లో విక్రయించే కల్తీ మద్యం వల్లే ప్రమాదం జరిగింది' అని ప్రచారం చేశారు. లైసెన్స్‌డ్ మద్యం షాపులోనే కొన్నట్లుగా సీసీ ఫుటేజీ లభ్యమయింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కర్నూలు మండలం బి. తాండ్రపాడుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కర్నూలు తాలుకా అర్భన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు IPC సెక్షన్ 153A (కమ్యూనల్ హేట్), 505(2) (పబ్లిక్ మిస్‌చీఫ్) కింద నమోదైంది.
27 మంది పేర్ల జాబితాలో ముఖ్యంగా ఆరే శ్యామల ఉన్నారు. వైసీపీ అధికారిక ఎక్స్ పేజీ నిర్వాహకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. పోలీసులు ఈ పోస్టులు, వీడియోలు, మెసేజ్‌లను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద కారణాలు స్పష్టంగా తేలాయి. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులుప్రకటించారు.





















