అన్వేషించండి

YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 

YS Jagan: చంద్రబాబు నాయుడు త్వరలో దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారంటూ కొన్ని మిడియా సంస్థలు (జగన్ భాషలో ఎల్లో మీడియా) చేస్తున్న హడావుడిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జగన్ నవ్వుతూ సమాధానమిచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారాలపై జగన్ సెటైర్లు వేశారు.
  • 11 మంది సభ్యులతోనే పోరాడుతున్నామని జగన్ పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
  • రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, చర్యలు తీసుకోవడం లేదని జగన్ ఆరోపించారు.
  • డైవర్షన్ కోసమే చంద్రబాబు మూడు, నాలుగు పిల్లల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని ప్రధాన మీడియా సంస్థల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, ఆయనకు ఉప ప్రధాని పదవి దక్కబోతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ ెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. బుధవారం తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అనేక ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. 

చంద్రబాబు నేషనల్‌ ప్లాన్స్‌ - జగన్ సెటైర్లు

చంద్రబాబు నాయుడు త్వరలో దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారంటూ కొన్ని మిడియా సంస్థలు (జగన్ భాషలో ఎల్లో మీడియా) చేస్తున్న హడావుడిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జగన్ నవ్వుతూ సమాధానమిచ్చారు. చంద్రబాబును ఇక్కడ ముఖ్యమంత్రిగానే ప్రజలు భరించలేకపోతున్నారు. అలాంటిది ఆయన ఉ ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలనపై ప్రజల్లో తీవ్ర అంసతృప్తి ఉందని, కనీసం ఇక్కడ సరిగా పాలన సాగించలేని వ్యక్తి దేశ స్థాయికి వెళ్తే పరిస్థితి ఏంటన్నట్టు ఆయన కామెంట్స్ చేశారు. 

గతంలో కూడా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూశారని, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అదంతా మీడియా సృష్టిస్తున్న భ్రమ మాత్రమే అని జగన్ అభిప్రాయపడ్డారు. మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తప్పుపట్టారు. బాబును ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

పవన్ వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ 

ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా జగన్ స్పందించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ... వైఎస్‌ఆర్‌ సీపీకి ఉన్నది కేవలం 11 మంది సభ్యులే అయినా వారు 1100 మందిలా మాట్లాడుతున్నారని అంటూ కామెంట్ చేశారు. ఈ విషయంపై కూడా మీడియా ప్రతినిధులు జగన్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన పాజిటివ్‌గా తీసుకున్నారు. " మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో పని చేస్తున్నారు. అది నిజంగా మంచి విషయమే కదా" అని బదులిచ్చారు. కేవలం 11 మంది సభ్యులతోనే ప్రభుత్వం అంతలా భయపడుతోందంటే తమ పార్టీ నేతల గొంతుక ఎంతలా పోరాడుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు తమ సభ్యుల పోరాట పటిమకు నిదర్శనమని, ప్రజల సమస్యల కోసం తాము ఎంత తక్కువ మంది ఉన్నా గట్టిగా పోరాడతామని జగన్ స్పష్టం చేశారు. 

మహిళలకు రక్షణ లేదు

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానని చెప్పిన చంద్రబాబు ఆచరణలో చూపడం లేదని విమర్శించారు. వీడియోలతో దొరికిపోయిన ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేల మాత్రమే కాదు, కనీసం తప్పు చేసిన పీఏలపై కూడా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 

డైవర్షన్ కోసం చంద్రబాబు తాపత్రయం 

చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రతి జంట ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలని చేసిన కామెంట్స్‌పై కూడా జగన్ మండిపడ్డారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని కొట్టిపారేశారు. ఎన్నికల ముందు చంద్రన్న పెళ్లికానుక కింద లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్క జంటకైనా డబ్బులు ఇచ్చారా అని ప్రశ్నించారు. తన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు కొత్తగా ముగ్గురు పిల్లల గురించి మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనన్నారు.  

Frequently Asked Questions

చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అవుతారని ప్రచారంపై జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారు?

చంద్రబాబు నాయుడు దేశానికి ఉప ప్రధాని అవుతారనే ప్రచారాన్ని జగన్ మోహన్ రెడ్డి కొట్టిపారేశారు. రాష్ట్రంలోనే చంద్రబాబు పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, అలాంటి వ్యక్తి దేశ స్థాయికి వెళ్లడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, వారు ఎక్కువగా మాట్లాడుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జగన్ స్పందన ఏమిటి?

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను జగన్ సానుకూలంగా తీసుకున్నారు. తమ పార్టీ ప్రతినిధులు నిబద్ధతతో పనిచేస్తున్నారని, కేవలం 11 మందితోనే ప్రభుత్వం భయపడుతుందంటే తమ గొంతుక ఎంత బలంగా వినిపిస్తుందో అర్థమవుతోందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో మహిళల భద్రతపై జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారా?

అవును, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానని చెప్పిన చంద్రబాబు, వీడియోలతో దొరికిపోయిన ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ వంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

ప్రతి జంట ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్ ఏమన్నారు?

చంద్రబాబు వ్యాఖ్యలను జగన్ డైవర్షన్ పాలిటిక్స్ అని కొట్టిపారేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ఇప్పుడు కొత్తగా పిల్లల గురించి మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ayushman Bharat Card Apply: కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
AP SMAM 2026 Applications : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Dwaraka Tirumala Fake Tickets: ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
ద్వారకా తిరుమలలో ఫేక్ దర్శనం టికెట్స్ స్కామ్.. ఏడుగురు అరెస్ట్
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS RR Result Update: వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
Islamabad Talks:
"డీల్ కుదరకపోతే దాడులే" ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరిక! ఇస్లామాబాద్‌ చర్చలపై ఉత్కంఠ!
Digital Payments: యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Chiranjeevi : తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Jana Nayagan Leaked : ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget