అన్వేషించండి

Nayanthara: నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార... ఆ కండిషన్స్ దెబ్బకు 30 కోట్లు లాస్!?

Mookuthi Amman 2: పాన్ ఇండియా సినిమా 'మూకుత్తి అమ్మన్ 2' నిర్మాతలకు నయనతార చుక్కలు చూపిస్తున్నారని కోలీవుడ్ గుసగుస. ఆవిడ దెబ్బకు 30 కోట్లు లాస్ కావచ్చని టాక్.

నయనతార (Nayanthara)తో నిర్మాతలకు ఇబ్బందులు తప్పవని తమిళ్ చిత్ర సీమతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖులు సైతం ఆఫ్ ది రికార్డ్ చెప్పే మాట. ఆవిడతో పబ్లిసిటీ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి వీల్లేదు. సినిమాకు సంతకం చేసేటప్పుడే ప్రచార కార్యక్రమాలకు రానని ఖరాకండిగా చెప్పేస్తారు.‌ సినిమా పూర్తయిన తర్వాత సంగతి కాదు... కొత్తగా సెట్స్ మీదకు వెళ్లిన సినిమా నిర్మాతలకు నయనతార చుక్కలు చూపిస్తున్నారనేది కోలీవుడ్ లేటెస్ట్ టాక్.

'మూకుత్తి అమ్మన్ 2' నిర్మాతలకు కండిషన్స్!
నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మైథాలజికల్ ఫాంటసీ ఫిల్మ్ 'మూకుత్తి అమ్మన్ 2' (Mookuthi Amman 2).‌ ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయింది.‌ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. చావు కబురు చల్లగా చెప్పినట్లు... షూటింగ్ స్టార్ట్ అయ్యాక నయన్ ఒక విషయం చెప్పారట. అవుట్ డోర్ షూటింగ్స్ చేయడం తనకు ఇష్టం లేదని, చెన్నై పరిసర ప్రాంతాలలో షూటింగ్ ప్లాన్ చేయమని ఆర్డర్ పాస్ చేశారట. 

Nayanthara conditions to Mookuthi Amman 2 makers; 'మూకుత్తి అమ్మన్ 2' కథ ప్రకారం కొన్ని సన్నివేశాలు చెన్నై కాకుండా వేరే ప్రదేశాలలో తీయాల్సి ఉంది.‌ తాను అక్కడికి రానని నయన్ చెప్పడం వల్ల చెన్నైలోని స్టూడియోలలో సెట్స్ వేయాల్సి వస్తుందట. దాంతో బడ్జెట్ భారీగా పెరుగుతోందని సన్నిహితుల దగ్గర నిర్మాతలు తమ గోడును వెళ్లబోసుకున్నారట. సినిమాకు 100 కోట్ల బడ్జెట్ అవుతుందని ముందుగా లెక్కలు వేసుకున్నారు. షూటింగ్ అంతా చెన్నైలో ప్లాన్ చేయడం వల్ల ఆ బడ్జెట్ కాస్త 100 నుంచి 130 కోట్లకు వెళ్లిందట. ఇప్పుడు ఆ 30 కోట్లు ఎక్స్ట్రా బర్డెన్ అని, అది లాస్ కిందకు వస్తుందని నిర్మాతలు వాపోతున్నారు. 

'మూకుత్తి అమ్మన్ 2' సినిమా నిర్మాణ సంస్థలలో నయనతార భర్త విఘ్నేష్ శివన్ కు చెందిన రౌడీ పిక్చర్స్ కూడా భాగస్వామి. అయితే నయనతార గాని ఆమె భర్తగానే రూపాయి పెట్టడం లేదట. నిర్మాణ ఖర్చులు అన్నీ వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, అవ్ని సినిమాక్స్ (పి) లిమిటెడ్, సంస్థలవేనని, లాభాల్లో వాటా కోసం తమ బ్యానర్ పేరు యాడ్ చేయించిందట నయనతార.‌

Also Readఅట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?


సినిమా ఓపెనింగ్ రోజు నుంచి గొడవలు!
'మూకుత్తి అమ్మన్ 2' సినిమా ప్రారంభోత్సవంలో దర్శక నిర్మాతలతో నయనతారకు గొడవ మొదలైందని కోలీవుడ్ టాక్. స్టేజి మీద తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, సెల్ఫీ తీయమని రెజీనాకు ఖుష్బూ ఫోన్ ఇవ్వడం ఏమిటని? తనకంటే ముందు రెజీనాను స్టేజి మీదకు ఎందుకు పిలిచారు? అని, మీనాను స్టేజి మీద నయనతార అవమానించారని కోలీవుడ్ కథలు కథలుగా చెబుతోంది. ఇప్పుడు షూటింగ్ మొదలైన తరువాత తనకు నచ్చిన లొకేషన్లలో ప్లాన్ చేయమని దర్శక నిర్మాతలకు నయనతార కండిషన్లు పెడుతోందని నయనతార ప్రవర్తన గురించి మరోసారి కథనాలు మొదలు అయ్యాయి. సినిమా పూర్తి అయ్యేసరికి ఇంకెన్ని గొడవలు వస్తాయో చూడాలి.

Also Readఎవరీ మహీరా శర్మ? సిరాజ్‌తో డేటింగ్ రూమర్లతో వైరల్... ఆవిడ ఏం చేసిందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Tirumala Latest News: తిరుపతి గోశాలపై రగులుతున్న రాజకీయం- రేపు పవన్ టూర్- మేమే వచ్చి లెక్కలు చూపిస్తామన్న భూమన
తిరుపతి గోశాలపై రగులుతున్న రాజకీయం- రేపు పవన్ టూర్- మేమే వచ్చి లెక్కలు చూపిస్తామన్న భూమన
UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు  ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై సూపర్ ఓవర్ లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamPreity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Tirumala Latest News: తిరుపతి గోశాలపై రగులుతున్న రాజకీయం- రేపు పవన్ టూర్- మేమే వచ్చి లెక్కలు చూపిస్తామన్న భూమన
తిరుపతి గోశాలపై రగులుతున్న రాజకీయం- రేపు పవన్ టూర్- మేమే వచ్చి లెక్కలు చూపిస్తామన్న భూమన
UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు  ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
DC vs RR Super Over: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
Santhanam: పదేళ్ల తర్వాత కమెడియన్‌గా 'సంతానం' రీఎంట్రీ - 'శింబు' సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారుగా!
పదేళ్ల తర్వాత కమెడియన్‌గా 'సంతానం' రీఎంట్రీ - 'శింబు' సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారుగా!
TTD: కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు, వాహనసేవలు వివరాలు ఇవే!
కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు, వాహనసేవలు వివరాలు ఇవే!
Odela 2 Twitter Review: తమన్నా సినిమాకు ట్విట్టర్ రివ్యూల్లేవ్... ముందు జాగ్రత్త పడిన 'ఓదెల 2' టీమ్
తమన్నా సినిమాకు ట్విట్టర్ రివ్యూల్లేవ్... ముందు జాగ్రత్త పడిన 'ఓదెల 2' టీమ్
Embed widget