Rajinikanth - Shah Rukh Khan: కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
Rajinikanth Kamal Haasan Film: సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి 47 ఏళ్ళ తర్వాత ఓ సినిమా చేస్తున్నారు. దీనికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ తర్వాత డ్రీమ్ కాంబో ఏమిటో తెలుసా?

తమిళ చలన చిత్ర పరిశ్రమలో... ఆ మాటకు వస్తే, భారతీయ చిత్రసీమలో అందరూ మెచ్చిన హీరోలు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan). ఈ ఇద్దరు హీరోలకు పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. తమ కెరీర్ బిగినింగ్‌లో కలిసి సినిమాలు చేసిన వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ 47 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి సినిమా చేస్తున్నారు.
వైరల్ ప్రోమో... ఇద్దరి స్టైల్ అదుర్స్!
రజనీ, కమల్ హాసన్ లేటెస్ట్ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. కానీ, ఈ మధ్య ప్రోమో విడుదల చేశారు... KH x RK Reunion పేరుతో! దీనికి మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ ప్లస్ అయ్యింది. 'ఆజా... రాజా...' అంటూ ఆయన అందించిన రెట్రో ట్యూన్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.
Also Read: 'దండోరా'కు ఆ కామెంట్స్ మైనస్సా.. వివాదంపై మళ్ళీ నోరు విప్పిన శివాజీ
రజనీ, కమల్ సినిమాలకు ఇంతకు ముందు మాస్ మ్యూజిక్ చేశానని, అందుకుని ఈసారి వైవిధ్యంగా ప్రయత్నిద్దామని రెట్రో టచ్ ఇస్తూ 'ఆజా రాజా' చేశానని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుధ్ రవిచందర్ తెలిపారు.
కమల్ హాసన్ తర్వాత షారుఖ్ కాంబో!
రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి సినిమా చేస్తే చూడాలనేది ఎంతో మంది ఫ్యాన్స్, ఆడియన్స్ కోరిక. ఇప్పుడు అది నెరవేరుతోంది. అసలు జరగదని అనుకున్నది జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. రజని - కమల్ కాకుండా అనిరుధ్ మనసులో అటువంటి డ్రీమ్ కాంబో ఏమైనా ఉందా? అంటే... అది రజనీకాంత్ - బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మల్టీస్టారర్ అని చెప్పారు. మరి ఆ కాంబో సెట్టవుతుందా? రజని - షారుఖ్ ఫ్యాన్ ఫాలోయింగ్ & ఇమేజ్‌లకు తగ్గ కథ తీసుకు వచ్చి, వాళ్ళిద్దరినీ ఒప్పించేది ఎవరో చూడాలి.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















