అన్వేషించండి

Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్

GHMC excavation works: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. స్ట్లీ ఫ్లైఓవర్.. అండర్ పాస్ నిర్మాణ పనులు ప్రారంభం కావడమే దీనికికారణం.

GHMC steel flyover and underpass Near KBR : హైదరాబాద్  నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. కేబీఆర్ పార్క్ వద్ద   స్టీల్ ఫ్లైఓవర్ ,  అండర్‌పాస్ నిర్మాణానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తవ్వకం పనులను ప్రారంభించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  ప్రాజెక్టులో భాగంగా ఈ పనులను చేపడుతున్నారు.

 కుంచించుకుపోయిన రహదారులు                                    

ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 పార్క్ హయత్ సమీపంలో  భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతానికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రధాన రహదారి ఇరుకుగా మారింది. మట్టి పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే పిల్లర్ల నిర్మాణ పనులు చేపడతామని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్ల వద్ద ఈ పనులు కొనసాగనున్నాయి.

 పీక్ అవర్స్‌లో తప్పని ఇబ్బందులు                           

ఈ ప్రాంతంలో స్టార్ హోటళ్లు, ఆసుపత్రులు,  వాణిజ్య సంస్థలు ఎక్కువగా ఉండటంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా ఉదయం 9 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉండనుంది. పనులు వేగం పుంజుకుంటే  ట్రాఫిక్ నిలిచిపోయే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    
ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై అడ్వైజరీ జారీ చేశారు:

 NFCL నుండి జూబ్లీహిల్స్/కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లేవారు:  శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్,  సాగర్ సొసైటీ వద్ద మళ్లింపు ఉంటుంది. వీరు శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ → ఇందిరానగర్ లేబర్ అడ్డా → రోడ్ నెం. 5 జూబ్లీహిల్స్ → వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మీదుగా ప్రయాణించాలి.

రోడ్ నెం. 36 & 45 నుండి NFCL వైపు వచ్చేవారు:  జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → వెంకటగిరి రోడ్ నెం. 2 → యూసుఫ్‌గూడ బస్తీ → మైత్రీవనం → అమీర్‌పేట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

పంజాగుట్ట (KCP) నుండి కేబీఆర్ పార్క్/రోడ్ నెం. 36 వైపు వెళ్లేవారు: బంజారాహిల్స్ రోడ్ నెం. 10 → క్యాన్సర్ హాస్పిటల్ → అగ్రసేన్ ఐలాండ్ → భారతీయ విద్యాభవన్ → రోడ్ నెం. 45 మీదుగా వెళ్లాలి.                  

మాసబ్ ట్యాంక్ నుండి జూబ్లీహిల్స్ వైపు వెళ్లేవారు: విరించి హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి → అగ్రసేన్ ఐలాండ్ → భారతీయ విద్యాభవన్ మీదుగా ప్రయాణించాలి.                    
 
నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సహకరించాలని, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు కోరుతున్నారు.          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget