Mohammed Siraj - Mahira Sharma: ఎవరీ మహీరా శర్మ? సిరాజ్‌తో డేటింగ్ రూమర్లతో వైరల్... ఆవిడ ఏం చేసిందో తెలుసా?
Mohammed Siraj dating Mahira Sharma?: మహీరా శర్మతో టీం ఇండియా క్రికెటర్, హైదరాబాదీ యువకుడు మహ్మద్ సిరాజ్ డేటింగ్ చేస్తున్నారా? ఆ రూమర్లకు ఆయన చెక్ పెట్టారు. అయితే... ఎవరీ మహీరా శర్మ? తెలుసుకోండి.

క్రికెట్ అభిమానులకు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యంగ్ క్రికెటర్ తెలుగు ప్రజల్లోనూ పాపులర్. హైదరాబాదీ యువకుడు కావడంతో ఈ టీం ఇండియా క్రికెటర్ మీద మనోళ్లు ఇంకాస్త ఎక్కువ అభిమానం చూపిస్తారు. ఇతను ఓ హిందీ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వచ్చాయి (Mohammed Siraj Dating Rumors). సదరు రూమర్లను సిరాజ్ ఖండించారు. అసలు ఎవరు ఆ మహీరా శర్మ? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి?
మహీరా ప్రేమలో మహ్మద్ సిరాజ్...
అదంతా అబద్ధం... నా గురించి అడగొద్దు!
మహీరా శర్మ (Mahira Sharma)తో తనకు ఎటువంటి రిలేషన్ లేదని మహ్మద్ సిరాజ్ స్పష్టం చేశారు. అసలు వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందనే పుకారు ఎప్పుడు మొదలైందో తెలుసా? రెండు సంవత్సరాల క్రితం! ఇన్‌స్టాగ్రామ్‌లో మహీరా శర్మ పోస్ట్ చేసిన ఒక ఫోటోను 2023లో మహ్మద్ సిరాజ్ లైక్ చేశారు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఒకానొక సమయంలో మహీరా తల్లి ఆ వార్తలను ఖండించారు కూడా! అయినా ఆ ప్రచారం ఆగలేదు. అయితే ఇప్పుడు మహ్మద్ సిరాజ్ ఆ వార్తలను ఖండించారు.
ముంబైలో మార్చి 20న ఒక అవార్డు వేడుకకు మహీరా శర్మ హాజరు కాగా... ఐపీఎల్ గురించి ఫోటోగ్రాఫర్లు టీజ్ చేశారు. మీకు ఇష్టమైన టీమ్ ఏది? అంటూ కాసేపు ఆట పట్టించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహ్మద్ సిరాజ్ దృష్టి వరకు వచ్చింది. దాంతో పాపారాజీ ఫోటోగ్రాఫర్లకు తనకు సంబందించిన క్వశ్చన్స్ అడగవద్దని రిక్వెస్ట్ చేశారు. తమ మధ్య రిలేషన్షిప్ ఉందనేది పూర్తిగా నిరాధారమైన వార్త అని, అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
అసలు ఎవరీ మహీరా శర్మ? ఏం చేసింది?
Who is Mahira Sharma?: మహ్మద్ సిరాజ్ గాళ్ ఫ్రెండ్ అంటూ ప్రచారంలో ఉన్న మహీరా శర్మ ఎవరో తెలుసా? ఆమెది జమ్మూ అండ్ కశ్మీర్. నవంబర్ 25, 1997లో జన్మించింది. ఉన్నత చదువుల కోసం ముంబై షిఫ్ట్ అయ్యింది.
Also Read: మీనాను అవమానించిన నయనతార... రెజీనా సెల్ఫీ తీయడంతో అసంతృప్తి, అలక?
బిగ్ బాస్ సీజన్ 13లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మహీరా శర్మ పాపులర్ అయ్యింది. ఆ షో తర్వాత ఆమె సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అంతకు ముందు ఆవిడ కొన్ని టీవీ సీరియల్స్ చేసింది. హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్స్ / సాంగ్స్ కూడా చేసింది. 'బిగ్ బాస్ 13' కంటే ముందు 'యారోం కా తషాన్', 'ఎం టీవీ డేట్ టు రిమెంబర్', 'తారక్ మెహతా కా ఓల్తా ఛష్మా'లో నటించింది. ఓ హిందీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరెవరితోనో ప్రేమలో ఉన్నట్టు ఫ్యాన్స్ లింక్ చేస్తారని మహీరా శర్మ కామెంట్ చేసింది.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

