అన్వేషించండి
Bhanumathi Serial Today March 22nd Episode Highlights:భానుకి పెళ్లి చూపులు పార్థుతో కాదా , బలరాం ఏం చేయబోతున్నాడు - భానుమతి మార్చి 22 ఎపిసోడ్ హైలెట్స్!
Bhanumathi Serial Today: చదువుకుని డాక్టర్ అవ్వాలని కలలు కనే భానుమతి.. తండ్రికోసం చదువు త్యాగం చేసిన పార్థు... ఇద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోంది. భానుమతి మార్చి 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

bhanumathi Serial march 22nd episode Written Update
1/9

శాంభవి అవమానించిన తర్వాత కోపంగా వచ్చిన ప్రమీల.. భర్త, అత్తని కడిగిపడేస్తుంది. ఆ ఇంట్లో జరిగిన అవమానం గురించి చెప్పి గుట్టుగా మమ్మల్ని బతకనివ్వరా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది
2/9

క్షమాపణలు చెప్పేందుకు ఇంటికి వచ్చిన పార్థుతో..మీరు ఈ సమయంలో ఇక్కడకు రావడం మంచిది కాదు..దీని వెనుక మరో అర్థాన్ని వెతుకుతారు అంటుంది ప్రమీల. మా ఇంట్లో వాళ్లవల్ల మీకు అవమానం జరిగింది..అందుకు నేను క్షమాపణలు చెబుతున్నా అంటాడు
3/9

మీ మంచితనాన్ని మరొకరికి పంచండి మా పేదరికాన్ని మాతోనే ఉండనీయండి ని కన్నీళ్లతో అడగుతుంది ప్రమీల. మరోసారి నా కూతురిని కలవొద్దు, నా కూతురితో మాట్లాడొద్దు..దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటుంది
4/9

మనం చేసే సాయం అవతలివాళ్లకు మేలు బదులు కీడు చేస్తుందని తెలుసుకోలేకపోయాను అని పార్థు బాధపడతాడు. మా అమ్మ అలా మాట్లాడినంందుకు మీరు బాధపడొద్దు మా అమ్మ జీవితంలో ఎలాంటి సంతోషం లేదని చెబుతుంది. మీ మనసు కష్టపెడితే క్షమించండి అంటుంది భానుమతి
5/9

బాధపడుతూ ఇంటికొచ్చిన పార్థుని సవతి తల్లి శారద భోజనానికి పిలుస్తుంది కానీ విసుక్కుంటాడు. ఆ తర్వాత తండ్రి వచ్చి తీసుకెళ్లి భోజనం దగ్గర కూర్చోబెడతాడు.
6/9

నా కూతురు అదృష్ట రేఖ గొప్పది ఆ అమ్మాయిని తప్పుదారి పట్టించాను అనుకుంటుంది శాంభవి. నాకు అధికారం కావాలి మీ నాన్నని దించాలి అనుకుంటున్నా అని శక్తి అనుకుంటారు. భాను మాటలు పదే పదే గుర్తొచ్చి తినకుండా వెళ్లిపోతాడు పార్థు.
7/9

పార్థుని గమనిస్తూనే ఉంటుంది శారద. ఇంతలో బాబాయ్ వచ్చి ఇక్కడున్నావా అని పలకరిస్తాడు. ఏమైందని అడుగుతాడు. భరించలేని బాధ గుండెల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు వస్తాయంటాడు. మజ్జిగ తీసుకెళ్లి ఇస్తుంది శారద..కానీ కోపంగా విసిరికొడతాడు పార్థు
8/9

పాలల్లో పంచదార వేయలేదా అని బలరాం అడుగుతాడు.. నచ్చినట్టుగా పాలు లేకపోతే ఒక్కరోజు తాగలేదు కదా అలానే మనకు ఇష్టమైన మనుషులు లేకుండా జీవితంలో ఆనందం ఉండదు అంటుంది. పార్థు కోరుకున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయనా అంటాడు బలరాం..
9/9

భానుమతి మార్చి 24 సోమవారం ఎపిసోడ్ లో ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు కోటి. మాట వినకపోతే మీ అమ్మను చంపేస్తానంటూ భానుని బెదిరిస్తాడు.
Published at : 22 Mar 2025 09:51 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion