KTR on Delimitation: భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాదిని ప్రోత్సహించాలి, లేదంటే అంతా ఏకమవుతాం: చెన్నైలో కేటీఆర్
KTR News | భారత్ సూపర్ పవర్ కావాలంటే దక్షిణాది లాంటి రాష్ట్రాలను ప్రోత్సహించాలి, లేకపోతే తామంతా ఏకమై పోరాటం చేస్తామని చెన్నైలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు.

Fair Delimitation News | హైదరాబాద్: ‘కేంద్ర ప్రభుత్వం చేయనున్న డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రం నష్టం జరుగుతుంది. ఇప్పటికే కేంద్రం వివక్షపూరిత విధానాలతో మనం చాలా కోల్పోయాం. దేశ అభివృద్ధి కోసం మనం చర్యలు తీసుకుని పని చేసినందుకు ఈరోజు మనం ఇబ్బంది పడుతున్నామని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. చెన్నైలో జరిగిన విపక్షాల సమావేశానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తిగా తీసుకుని నడుస్తాం. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు దేశానికి స్ఫూర్తినిచ్చింది. ద్రావిడ ఉద్యమం తమ హక్కులు సాధించుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలకు ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు ( democracy cannot should not become a mobocracy). మందబలం ఉంటే నియంతృత్వం రావద్దు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ డిలిమిటేషన్ విధానంతో నష్టం, దేశాన్ని వెనక్కి నడిపిస్తున్న ఉత్తరాది రాష్ట్రాలకి లాభం చేకూరుస్తుంది. జిడిపిలో దేశానికి 36% భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష పడుతుంది. ఇది సరైన నిర్ణయం కాదు.
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు
కేంద్ర ప్రభుత్వ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపడం కొత్తేమీ కాదు. కానీ డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. నిధుల కేటాయింపుల్లోనూ నష్టం జరగబోతుంది. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నది. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం పెరుగుతుంది.
బుల్లెట్ రైలు ఉత్తరాదికే పరిమితం
అన్ని రాష్ట్రాలకు సమన్యాయమని చెప్పే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పైన పుండుపైన ఉప్పు రుద్దినట్టుగా ఉన్నాయి. ఓ ప్రాంతంపై మరో ప్రాంతం ఆదిపత్యం చలాయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కేవలం జనాభా ఆధారంగా ఎంపీ సీట్లు పెంచితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలుగుతుంది. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు కేటాయించడాన్ని మేం వ్యతిరేకించలేదు. కేవలం నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
భారత్ సూపర్ కావాలంటే..
1971 తర్వాత ఉన్న పార్లమెంటు సీట్లు కేటాయింపు తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగడం అన్యాయం. దేశ అభివృద్ధి కోసం జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలం కావడంతో వారికి డీలిమిటేషన్లో లబ్ధి జరగడం కరెక్టేనా. స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలకు 2047 నాటికి సూపర్ పవర్ కావాలి అంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సహించాలి. కానీ శిక్షించకూడదు. ఈరోజు మనం డీలిమిటేషన్‌పై వ్యతిరేకించకపోతే చరిత్ర మనల్ని క్షమించదు, భవిష్యత్ భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయని కేటీఆర్ అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

