అన్వేషించండి

Ugadi Panchangam 2026: పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?

Parabhava Nama Samvatsara Panchangam: శ్రీ పరాభవ నామసంవత్సరంలో సింహ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయి? ఏ గ్రహం అనుకూలం? ఏ గ్రహం ప్రతికూలం? 2026 - 2027 వార్షిక ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Simha rashi parabhava nama samvatsaram phalitalu 2026 2027
సింహ రాశి

మఘ , పుబ్బ, ఉత్తర 1 పాదము

ఆదాయం 5 వ్యయం 5  రాజపూజ్యం 7 అవమానం-7
 
పరాభవ నామ సంవత్సరంలో సింహ రాశివారికి కుటుంబకారకుడైన గురుడు 12వ ఇంట కేతువుతో కలసి సంచరిస్తున్నాడు. అందుకే ఈ రాశివారికి ఈ ఏడాది శారీరకంగా, మానసికంగా కుంగుబాటు ఉంటుంది. ఆరోగ్య బాధలు, కంటికి సంబంధించిన సమస్యలు తప్పవు. అవమానకరమైన పనులు, అపనిందలు, రావలసినసొమ్ముకు ఆటంకాలు, ఇవ్వాల్సినవి సమయానికి ఇవ్వలేకపోవడం, ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపం ఉంటుంది. ఊహించని సంఘటనలు చాలా జరుగుతాయి. ఏడాది ప్రారంభంలో నష్టాలున్నా చివరకు ఆదాయం, రాజ్యపూజ్యత కొంత మేర బావుంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. మీ తెలివి తేటలు వల్ల కొన్ని గడ్డు సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణంలో నష్టం, చోర భయం, కంఠ బాధలు ఉంటాయి. ఏ చిన్న కార్యం తలపెట్టినా కుటుంబంలో మహిళల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువులతో సంతోషంగా ఉంటే సమయస్ఫూర్తితో మెలగాలి
 
పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉద్యోగులకు

పరాభవ నామ సంవత్సరం సింహ ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు. గురు, శనుల ప్రభావం వలన అసంతృప్తి, మాటలో నిలకడ ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేవారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు, సస్పెండ్ తప్పదు, నిందారోపణలకు గురి అగుట, అధికారులు వల్ల ఇబ్బందులు, సెలవులు అధికంగా తీసుకోవడం జరుగుతుంది. పర్మినెంటుకాని వార్కి ఈ ఏడాది కూడా నిరాశే మిగులును. నిరుద్యోగులకు అంత ఆశాజనకంగా ఉండదు. గృహనిర్మాణములు, నూతన వాహన ప్రాప్తి  కలుగుతుంది. 

పరాభవ నామ సంవత్సరం సింహ రాశి రాజకీయనాయకులకు

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గడ్డుకాలమే. గురు శని బలం లేని కారణంగా మీపై నిందారోపణలు వచ్చును. ప్రజల్లో గుర్తింపు ఉండదు. అధిష్టాన వర్గంలోనూ పేరుఉండదు. ఏ పదవి వచ్చేఅవకాశంలేదు. ఉన్నపదవులను కోల్పోవుదురు. ఎన్నికలలో పోటీచేసినా ఓటమి పాలగుదురు. అధిక ధనవ్యయం, స్థిరాస్తులనుపోగొట్టుకుంటారు.  
 
పరాభవ నామ సంవత్సరం సింహ రాశి కళాకారులకు
 
ఈ రాశి కళాకారులకు పరాభవ నామ సంవత్సరం అనుకూలంగా ఉండదు. టీవీ, సినిమా రంగంలో ఉండేవారు అవకాశాలు కోల్పోతారు.    గాయనీ,గాయకులు, నటీనటవర్గం, సాంకేతిక నిపుణులకు మంచి సమయం కాదు. అవార్డుల విషయంలోనూ మీకు అన్యాయం జరుగుతుంది

సింహ రాశి వ్యాపారులకు

ఈ రాశి వ్యాపారులకు పరాభవ నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆశించిన స్థాయిలో లాభం రాదు. వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. బంగారం, వెండి వ్యాపారులకునష్టాలుంటాయి. సరుకులు నిల్వచేసేవారికి పర్వాలేదు. నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారం చేసేవారికి సాధారణ ఫలితాలున్నాయి. జాయింట్ వ్యాపారం చేసేవారు తగాదాల కారణంగా విడిపోతారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు రాణిస్తారు

సింహ రాశి విద్యార్థులకు

సింహ రాశి విద్యార్థులకు పరాభవ నామ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది..చదువుపై కన్నా ఇతర వ్యాపకాలపై దృష్టి సారిస్తారు. బొటా బొటి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్, బి.ఇడి., లాసెట్, ట్. అనెట్, పాలిటెక్నిక్ సహా ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు రావు, కోరుకున్న కళాశాలలో సీట్ పొందలేరు. 

సింహ రాశి వ్యవసాయదారులకు

ఈ రాశి వ్యవసాయదారులకు  మొదటి పంటకంటే రెండవపంట ఫలిస్తుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. ఇంట్లో విరోధాలు పెరుగుతాయి, చేపలు, రొయ్యలు చెరువుల వ్యాపారం చేసేవారికి నష్టం తప్పదు. పౌల్ట్రీకి చెందేవారికి నష్టాలే. మాటపట్టింపులు ఎక్కువగా ఉంటాయి

సింహ రాశి స్త్రీలకు

సింహ రాశి స్త్రీలకు ఈ ఏడాది మంచి ఫలితాలు లేవు. మాట పట్టింపులు, విరోధాలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఉద్యోగాలు చేసేవారికి దూరప్రాంతములకు బదీలీ అవుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. శస్త్రచికిత్సజరుగును. గర్భిణీస్త్రీలకు ఆపరేషన్ అవుతుంది. 

ఓవరాల్ గా సింహరాశివారికి ఈ ఏడాది సవాలుగా ఉండబోతోంది.  మీయొక్కశక్తిసామర్ధ్యాలు, తెలివితేటలు, ధైర్యసాహసాలు ప్రదర్శించినా పెద్దగా ఫలితం ఉండదు. సంయమనం పాటించాలి..సహనంగా వ్యవహరించాలి..కష్టపడాలి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, పంచాంగం నుంచి సేకరించి రాసిన వివరాలు ఇవి. ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి. ఏదైనా లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

వృషభ రాశివారికి పరాభవ నామ సంవత్సరం అద్భుతంగా ఉంటుందా? 2026 ఉగాది పంచాంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!

2026 ఉగాది ఎప్పుడు? రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ugadi Panchangam 2026: ఉగాది పంచాంగం కుంభ రాశి 2026- 2027! గురుడు బలం, శని భయం.. ఆగస్టు వరకు అదృష్టం.. ఆ తర్వాత భారీ మార్పులు!
ఉగాది పంచాంగం కుంభ రాశి 2026- 2027: గురుడు బలం, శని భయం.. ఆగస్టు వరకు అదృష్టం.. ఆ తర్వాత భారీ మార్పులు!
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Ugadi Panchangam 2026: మకర రాశివారికి ఈ ఏడాది శని బలం, అదృష్టం మీ సొంతం! సెప్టెంబర్ తర్వాత అన్నీ అద్భుతాలే! ఉగాది పంచాంగం 2026- 2027
ఉగాది పంచాంగం 2026- 2027: మకర రాశివారికి ఈ ఏడాది శని బలం, అదృష్టం మీ సొంతం! సెప్టెంబర్ తర్వాత అన్నీ అద్భుతాలే!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget