Nayanthara: మీనాను అవమానించిన నయనతార... రెజీనా సెల్ఫీ తీయడంతో అసంతృప్తి, అలక?
Nayanthara vs Meena: నయనతార, సీనియర్ హీరోయిన్ మీనా మధ్య గొడవ జరిగిందా? రెజీనాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని లేడీ సూపర్ స్టార్ అలిగిందా? అంటే 'అవును' అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

తమిళ దర్శకుడు సుందర్ సి, అతని భార్య - సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ప్రవర్తన పట్ల నయనతార (Nayanthara) ఆగ్రహంగా ఉన్నారా? మరొక సీనియర్ హీరోయిన్ మీనాతో గొడవ పెట్టుకున్నారా? ఆవిడను అవమానించారా? రెజీనాకు సెల్ఫీ తీయమని ఖుష్బూ ఫోన్ ఇవ్వడంతో అలక బూనారా? అంటే... 'అవును' అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 'మూకుత్తి అమ్మన్ 2' ప్రారంభోత్సవంలో జరిగిన గొడవ (పరిణామాలు) కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
పూజలో మీనాను అవమానించిన మీద నయన్?
'మూకుత్తి అమ్మన్' సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తీస్తున్నారు. అయితే ఆర్జే బాలాజీ కాకుండా 'మూకుత్తి అమ్మన్ 2' సినిమాకు సుందర్ సి దర్శకుడిగా వచ్చారు. ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయింది.
'మూకుత్తి అమ్మన్ 2' ప్రారంభోత్సవంలో మీనాను నయన్ అవమానించారని, అసలు ఆవిడ వైపు కన్నెత్తి కూడా చూడలేదని, నయన్ ప్రవర్తన అక్కడ ఉన్న వ్యక్తులందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం ఏమిటి? అంటే కోలీవుడ్ వర్గాలలో ఒక చర్చ నడుస్తోంది.
Also Read: అనుష్క సినిమా వెనక్కి... ఏప్రిల్‌లో ఆ డేట్ మీద కర్చీఫ్ వేసిన తమన్నా 'ఓదెల 2'
'మూకుత్తి అమ్మన్ 2' ప్రారంభోత్సవానికి ముందు తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవద్దని నయన్ ఒక లేఖ విడుదల చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరిగింది. లేడీ సూపర్ స్టార్ అని నయనతార తన సినిమాలలో వేసుకోవడం పట్ల కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేయగా... తన పేరు ముందు అటువంటి టైటిల్స్ వద్దని ఆవిడ అనౌన్స్ చేసిన తర్వాత అసలైన లేడీ సూపర్ స్టార్ మీనా అంటూ కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దాంతో మీనాను నయన్ అవమానించారట.
సెల్ఫీ తీయమని రెజీనాకు ఫోన్ ఇవ్వడం ఏమిటి?
'మూకుత్తి అమ్మన్ 2' ప్రారంభోత్సవంలో హీరోయిన్ రెజీనా తీసిన సెల్ఫీ వైరల్ అయింది. అయితే ఆ సెల్ఫీ వెనుక కూడా ఒక కథ ఉంది. తనకు కాకుండా రెజీనాను సెల్ఫీ తీయమని ఫోన్ ఇచ్చారని నయన్ అసంతృప్తి వ్యక్తం చేశారట. సెల్ఫీ తీసినది రెజీనా అయినప్పటికీ... నా ఫోన్ మాత్రం దర్శకుడు సుందర్ సి భార్య ఖుష్బూది.
View this post on Instagram
'మూకుత్తి అమ్మన్ 2'లో మెయిన్ లీడ్ చేస్తున్న తనకు మాత్రమే సినిమా ప్రారంభోత్సవంలో ప్రాధాన్యం, గౌరవం ఇస్తానని చెప్పిన దర్శక నిర్మాతలు... తనతో పాటు మిగతా హీరోయిన్లను కూడా ఆహ్వానించడం, తన కంటే వేదిక మీదకు రెజీనాను ముందుగా తీసుకు వెళ్లడం పట్ల నయనతార అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు నిరాశకు గురయ్యారట. ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకులలో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.
Also Read: చిన్నతనంలో దారుణమైన అనుభవాలు... లైంగిక వేధింపులపై కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

