స్టార్ హీరోయిన్ నయనతార కవలలకు తల్లి అయ్యారు. తన చిన్నారి బాబుతో ఆమె దిగిన ఫోటో ఇది. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార వివాహం ఈ ఏడాది జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 9న నయన్, విఘ్నేష్ శివన్ వివాహం జరిగింది. అంటే... ఇప్పటికి నాలుగు నెలలు అయ్యింది. పెళ్ళైన నాలుగు నెలలకు నయనతార తల్లి కావడం ఏమిటి? అని షాక్ అవుతున్న జనాలు ఎంతోమంది ఉన్నారు. పెళ్లి తర్వాత నయనతార గర్భం దాల్చినట్లు ఎక్కడా కనిపించలేదు. హానీమూన్ ఫొటోల్లో కూడా మామూలుగా ఉన్నారు. మరి, నయన్ & విఘ్నేష్ ఎలా తల్లిదండ్రులు అయ్యారంటే... సరోగసీ ద్వారా జన్మనిచ్చారని సమాచారం. తమకు ట్విన్ బేబీ బాయ్స్ జన్మించినట్లు విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. పిల్లల పాదాలను ముద్దాడుతున్న నయన్, విఘ్నేష్ పెళ్లికి ముందు నుంచి పిల్లల గురించి నయన్, విఘ్నేష్ ప్లాన్ చేసుకున్నారట. తల్లిదండ్రులైన నయన్, విఘ్నేష్ దంపతులకు ABP Desam తరఫున శుభాకాంక్షలు. (All Images courtesy - @wikkiofficial/Instagram)