తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ సెలబ్రిటీల్లో శ్రీముఖి ఒకరు. పెళ్లి ఎప్పుడు? అనే క్వశ్చన్ ఆమెకు ఎదురవుతుంది? గతంలో పెళ్లి గురించి శ్రీముఖి మాట్లాడారు. తనకు 31 ఏళ్ళు వచ్చినప్పుడు ఏడు అడుగులు వేస్తానని చెప్పారు. ఇప్పుడు శ్రీముఖి వయసు 29 ఏళ్ళు. అంటే ఇంకో రెండేళ్ల వరకు ఆమె పెళ్లి ఊసు ఎత్తరన్నమాట! రెండేళ్ల వరకు శ్రీముఖి యాంకరింగ్, యాక్టింగ్ అంటూ బిజీ బిజీగా గడిపేసే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత నటించడకూడదని రూల్ ఏమీ లేదు. శ్రీముఖి పెళ్ళయాక కూడా నటించవచ్చు. కుటుంబ సభ్యులు చూసిన అబ్బాయితో అయినా సరే కొన్నాళ్ళు ట్రావెల్ చేశాక పెళ్లి చేసుకుంటానని గతంలో శ్రీముఖి చెప్పారు. సెన్సిబుల్ పర్సన్ భర్తగా రావాలని వెయిట్ చేస్తున్నట్టు శ్రీముఖి పేర్కొన్నారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు, జీవిత భాగస్వామికి టైమ్ కేటాయించడం వంటివి ఉంటాయి. అందువల్ల, పెళ్ళయాక శ్రీముఖి చేసే షోస్, సినిమాల సంఖ్య తగ్గవచ్చు. ప్రస్తుతం డ్యాన్స్ ఐకాన్ షో చేస్తున్నారు. (All Images courtesy - @Sreemukhi/Instagram)