టీవీల్లో, సినిమాల్లో సందడి చేసే శ్రీముఖి, ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేస్తున్నారు. ఆహా ఓటీటీలో వస్తున్న డాన్స్ ఐకాన్ షోలో శ్రీముఖి సరికొత్త డ్రస్‌లతో హంగామా చేస్తున్నారు. స్టేజి మీద ఉండి యాంకరింగ్ చేసే శ్రీముఖి, ఇప్పుడు 'డాన్స్ ఐకాన్'లో కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. టీవీ షోల్లో శ్రీముఖి డ్రసింగ్‌కు, 'డాన్స్ ఐకాన్'లో డ్రసింగ్‌కు చాలా డిఫరెన్స్ కనబడుతోంది. బుల్లితెరపై శ్రీముఖి కనిపించని వారం ఉండదు. ప్రతి వారం ఏదో ఒక షోలో ఆమె కనిపిస్తారు. అప్పుడప్పుడూ శ్రీముఖి మోడ్రన్ డ్రస్‌లు ధరిస్తారు. అయితే... ఈ రేంజ్ షో ఈ మధ్య కాలంలో లేదని చెప్పాలి. ఇప్పుడు శ్రీముఖి రెగ్యులర్ గా 'జాతి రత్నాలు' షో చేస్తున్నారు. 'పటాస్'తో ఆవిడకు బ్రేక్ ఇచ్చిన మల్లెమాల సంస్థ చేస్తున్న ప్రోగ్రాం ఇది. టీవీ షోస్ మాత్రమే కాదు... శ్రీముఖి సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో శ్రీముఖి కీలక పాత్ర చేస్తున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (All Images courtesy - @sreemukhi/Instagram)