ఏంటీ సురేఖా గారు ఇంత యంగ్‌గా ఉన్నారు, ఆ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా! సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ క్రేజ్ పెంచుకుంటున్న నటి సురేఖా వాణి. సురేఖ, ఆమె కూతురు సుప్రిత కలిసి చేసే రచ్చ అంతా ఇంత కాదు. గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో ఇద్దరూ సందడి చేస్తుంటారు. సురేఖ ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ షోతో రంగుల లోకంలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’కు సురేఖ భర్త సురేష్ తేజ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. సహాయ నటిగా బిజీగా ఉన్న సమయంలో సురేఖ తన భర్తను కోల్పోయారు. సురేఖ ఇటీవల విడుదలైన ‘షికారు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’లో నటించారు. తాజాగా విడుదలైన ‘స్వాతి ముత్యం’ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు. అయితే, సురేఖావాణి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె యంగ్ లుక్ చూసి.. ‘‘ఏంటీ సురేఖా గారు ఇంత అందంగా ఉన్నారు’’ అని ఫ్యాన్స్ అంటున్నారు. Images and Videos Credit: Surekhavani/Instagram