వాన చినుకులు ఇట్టా తడిపితే - వర్షంలో అంజలి ఆట, తడిచి ముద్దయిన ముద్దుగుమ్మ! తాజాగా అంజలి ‘మాచర్ల నియోజకర్గం’లో నిఖిల్‌తో స్టెప్పులేశారు. ‘రాను రానంటూ’ పాటలో దుమ్ము దులిపారు. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా మొత్తానికి ఆ పాటే హైలెట్. అంజలి ఇప్పుడు స్లిమ్‌గా మారి మరింత క్యూట్‌గా మురిసిపోతున్నారు. ప్రస్తుతం మలయాళ చిత్రం ‘నయాట్టు’ తెలుగు రీమేక్‌లో అంజలి నటిస్తున్నారు. తెలుగు వెబ్ సీరిస్ ‘ఝాన్సీ’, కన్నడంలో ‘బైరాగీ’ సినిమాలోనూ నటిస్తున్నారు. అంజలి తాజాగా చీర కట్టుకుని వర్షంలో క్రికెట్ ఆడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాను గుర్తుతెచ్చుకుంటున్నారు. ఆ సినిమాలో ‘వాన చినుకులు ఇట్టా తడిపితే’ పాటకు వెంకీతో కలిసి అంజలీ స్టెప్పులు వేశారు. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న అంజలీని ఈ వీడియోలో చూడొచ్చు! Images and Videos Credit: Anjali/Instagram